- Home
- Sports
- Cricket
- IPL 2022: లక్నోతో మ్యాచ్ కు ఢిల్లీకి గుడ్ న్యూస్.. జట్టుతో కలువనున్న ఆ ఇద్దరు.. కన్ఫర్మ్ చేసిన షేన్ వాట్సన్
IPL 2022: లక్నోతో మ్యాచ్ కు ఢిల్లీకి గుడ్ న్యూస్.. జట్టుతో కలువనున్న ఆ ఇద్దరు.. కన్ఫర్మ్ చేసిన షేన్ వాట్సన్
TATA IPL 2022 - DC vs LSG: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు శుభవార్త. లక్నో సూపర్ జెయింట్స్ తో నేడు ఆ జట్టు ఢీ కొనబోతున్నది. ఢిల్లీ ఏరికోరి తెచ్చుకున్న ఇద్దరు ఆటగాళ్లు.. లక్నోతో మ్యాచులో ఆడనున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్ తో గురువారం రాత్రి ఢీకొనబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ శుభవార్త చెప్పాడు. రిటెన్షన్ తో పాటు వేలంలో ఆ జట్టు ఏరికోరి తీసుకున్న ఇద్దరు ఆటగాళ్లు ఈ మ్యాచులో ఆడనున్నారు.
ఐపీఎల్-15 ప్రారంభ సమయంలోనే జట్టుతో చేరినా ఇన్నాళ్లు ఫిట్నెస్ సమస్యలతో దూరంగా ఉన్న దక్షిణాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్త్జ్.. ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ లక్నోతో మ్యాచ్ ఆడే అవకాశముంది.
ఈ మేరకు ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఏప్రిల్ 2న ముంబైకి చేరుకున్న వార్నర్ భాయ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు.
ఇక ఐపీఎల్ ఆరంభమయ్యాకే వచ్చిన నోర్త్జ్ కూడా ఫిట్నెస్ సాధించాడు. గతేడాది ఐపీఎల్ సీజన్ సందర్భంగా దుబాయ్ లో గాయపడ్డ నోర్త్జ్.. ఏడు నెలల అనంతరం గ్రౌండ్ లో అడుగుపెడుతున్నాడు.
దక్షిణాఫ్రికా ఫిట్నెస్ టెస్టును కూడా నోర్త్జ్ అధిగమించాడని అతడు లక్నోతో మ్యాచులో ఆడతాడని వాట్సన్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇక ఐపీఎల్ లో లక్నో-ఢిల్లీ ల మధ్య మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు రెండు మ్యాచులాడి ఒకటి గెలిచి ఒకదాంట్లో ఓడిన ఢిల్లీ.. వార్నర్, నోర్త్జ్ రాకతో మరింత పటిష్టంగా మారింది.
లక్నోతో మ్యాచ్ గురించి వాట్సన్ స్పందిస్తూ... ‘కెఎల్ రాహుల్ చాలా ప్రమాదకర ఆటగాడు. అతడు ఏ క్షణంలో అయినా మ్యాచ్ ను తనవైపునకు తిప్పుకోగల ఆటగాడు. రాహుల్ తో పాటు డికాక్, హుడా, బదోని వంటి ఆటగాళ్లతో ఆ జట్టు బలంగా ఉంది. ఆ జట్టును ఎదుర్కోవాలంటే మేం మంచి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది..’ అని తెలిపాడు.