ఇంకొక్క మ్యాచ్ ఓడితే సీఎస్‌కే ఇంటికే... భారత మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ కామెంట్...
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్‌ని ఆరంభించింది చెన్నై సూపర్ కింగ్స్. సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకోవడంతో జడ్డూ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు...

జరగబోయేది ముందే ఊహించి ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడా? లేక జడ్డూ లక్ బాగోలేకనే తెలీదు కానీ చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇప్పటిదాకా సీజన్‌లో ఏదీ కలిసి రాలేదు...
కేకేఆర్‌తో మొదటి మ్యాచ్‌లో పోరాడి ఓడిన సీఎస్‌కే, లక్నోపై భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక చేతులు ఎత్తేసింది. పంజాబ్ కింగ్స్‌పై ఓ మాదిరి టార్గెట్‌ను కూడా ఛేదించలేక చేతులు ఎత్తేసింది...
వరుసగా మొదటి మూడు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. ఒక్క విజయం వస్తే చాలు, వరుస విజయాలతో కమ్‌బ్యాక్ ఇస్తామని జడ్డూ ఆశాభావం వ్యక్తం చేశాడు...
10 జట్లు పాల్గొంటున్న సీజన్ కావడంతో మరో మ్యాచ్ ఓడితే, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడం కష్టమైనని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్...
‘వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోవడం వల్ల మరో మ్యాచ్ ఓడితే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడం కష్టమైపోతుంది...
టాప్ 4లో నిలవాలంటే వరుస విజయాలు అందుకోవాల్సి ఉంటుంది. అదీకాకుండా సీఎస్‌కే నెట్ రన్ రేట్ కూడా బాగోలేదు... ఆడాల్సిన మ్యాచుల సంఖ్య తక్కువగా ఉంది..
10 జట్లు పాల్గొంటుండడంతో ప్లేఆఫ్స్ చేరే జట్ల లెక్కలు ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేం. టాప్ 4లో చేరాలంటే ఎన్ని పాయింట్లు కావాలి?
ఇప్పుడున్న పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 4లోకి రావాలంటే భారీ విజయాలు అందుకోవాలి. సీఎస్‌కే పర్ఫామెన్స్ కూడా కరెక్టుగా లేదు...
టాపార్డర్ రాణించడం లేదు, మిడిల్ ఆర్డర్‌లో పరుగులు రావడం లేదు. ఒకటీ రెండు భాగస్వామ్యాలు తప్ప సీఎస్‌కే బ్యాటింగ్, బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది...
సీఎస్‌కే ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి అవసరమైన ప్లాన్, వారి కెప్టెన్ దగ్గర కానీ, మాజీ కెప్టెన్ దగ్గర కానీ ఉందా?...’ అని కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్...