రిషబ్ పంత్ సేఫ్ గేమ్... సర్ఫరాజ్ ఖాన్ కంటే ముందు బౌలర్లను బ్యాటింగ్‌కి పంపి...
దేశవాళీ టోర్నీల్లో అసాధారణ పర్ఫామెన్స్ ఇస్తూ క్రికెట్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, ఐపీఎల్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు...

మొదటి రెండు మ్యాచుల్లో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సర్పరాజ్ ఖాన్, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 3 ఫోర్లతో 36 పరుగులు చేశాడు..
ఇదే మ్యాచ్‌లో రిషబ్ పంత్ 36 బంతులాడి 39 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తనకంటే వేగంగా పరుగులు చేసినా, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ని బ్యాటింగ్ ఆర్డర్‌లో డీమోట్ చేశాడు రిషబ్ పంత్...
ప్రధాన బ్యాటర్‌గా టీమ్‌కి ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్, ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయినా క్రీజులోకి రాలేకపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ కంటే ముందు లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ వంటి బౌలింగ్ ఆల్‌రౌండర్లు బ్యాటింగ్‌కి రావడం హాట్ టాపిక్ అయ్యింది...
సర్ఫరాజ్ ఖాన్ ఆటతీరు ఇంచుమించు రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టైల్‌కి దగ్గరగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పంత్ టెక్నిక్ కంటే సర్ఫరాజ్ ఖాన్ టెక్నికల్ ప్లేయర్.
Rishabh Pant
వికెట్ కీపింగ్ పొజిషన్ కోసం ఇప్పటికే ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, వృద్ధిమాన్ సాహాలతో పోటీపడుతున్నాడు రిషబ్ పంత్...
రిషబ్ పంత్ కెప్టెన్సీ చూస్తుంటే తన ప్లేస్‌కి ప్రమాదకారిగా మారుతున్న ప్లేయర్లను తెలివిగా సైడ్ చేస్తున్నట్టుగా ఉందని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...
సర్పరాజ్ ఖాన్‌తో పాటు యంగ్ వికెట్ కీపర్ కెఎస్ భరత్ కూడా ఇప్పటిదాకా ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోవడం రిషబ్ పంత్ కెప్టెన్సీపై అనుమానాలు రేపుతోందని అంటున్నారు అభిమానులు...
ఐపీఎల్‌లో పాకెట్ డైనమేట్‌లా ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. అండర్ 19 వరల్డ్ కప్ 2014లో పర్ఫామెన్స్ ద్వారా ఐపీఎల్ 2015లో ఆర్‌సీబీ తరుపున ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్... రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 45 పరుగులు చేశాడు...
సర్ఫరాజ్ ఖాన్ డ్రెస్సింగ్ రూమ్‌కి వస్తున్న సమయంలో 17 ఏళ్ల కుర్రాడికి వంగి స్వాగతం పలికాడు విరాట్ కోహ్లీ. అయితే ఫిట్‌నెస్ కారణాలతో సర్పారాజ్ ఖాన్ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
sarfaraz khan
2017లో కాలి గాయంతో బాధపడుతూ ఐపీఎల్ మిస్ చేసుకున్న సర్పరాజ్ ఖాన్, 2018లో ఆర్‌సీబీ రిటెన్షన్ పొంది అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే ఆ 2018 సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు సర్ఫరాజ్ ఖాన్...
Sarfaraz Khan
ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టుకి ఆడిన సర్ఫరాజ్ ఖాన్ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. అరకోర అవకాశాలు వచ్చినా వాటిని సర్ఫరాజ్ ఖాన్ సరిగా వినియోగించుకోలేకపోయాడు...