- Home
- Sports
- Cricket
- ఆయుష్ బదోనీ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినా, పక్కనబెట్టేశారు... ఇప్పుడు అదే టీమ్‌ని ఓడించి...
ఆయుష్ బదోనీ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినా, పక్కనబెట్టేశారు... ఇప్పుడు అదే టీమ్‌ని ఓడించి...
ఐపీఎల్ 2022 సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోనీ. మొదటి మ్యాచ్ నుంచి నిలకడైన ప్రదర్శన ఇస్తున్న ఆయుష్ బదోనీ, రెండు మ్యాచుల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కి విజయాలను అందించాడు. ఢిల్లీపై లక్నో విజయానికి కూడా బదోనీ, ఆఖర్లో ఆడిన మెరుపు ఇన్నింగ్స్ కారణం...

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసిన ఆయుష్ బదోనీ, కెఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, ఇవిన్ లూయిస్ వంటి స్టార్ ప్లేయర్లు ఫెయిల్ అయిన మ్యాచ్‌లో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు...
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆఖర్లో వచ్చి 9 బంతుల్లో 2 సిక్సర్లతో 19 పరుగులు చేసిన ఆయుష్ బదోనీ ఇన్నింగ్స్, లక్నోకి మొదటి విజయాన్ని అందించింది...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి రనౌట్ అయిన ఆయుష్ బదోనీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసి ఆఖర్లో ఉత్కంఠకు తెరదింపి... లక్నోకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాడు...
Ayush Badoni
వాస్తవానికి ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోనీని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ స్కాట్స్ 3 లెవెల్స్ ట్రయల్స్ పూర్తి చేయాల్సిందిగా సూచించింది... ఇందులో ముంబైలో థర్డ్ వేవ్ ఉన్న సమయంలో మూడో లెవెల్ ట్రయల్స్ జరిగాయి...
ఇందులో 20 కంటే తక్కువ బంతుల్లోనే భారీ షాట్లతో 50 పరుగులు చేశాడు ఆయుష్ బదోనీ. అయితే బదోనీ పర్ఫామెన్స్‌తో ఇంప్రెస్ కాని ఢిల్లీ క్యాపిటల్స్, అతని కోసం బిడ్ వేయలేదు...
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో ఆయుష్ బదోనీ పర్ఫామెన్స్ చూసిన లక్నో సూపర్ జెయింట్స్, అతన్ని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. మొదటి మ్యాచ్‌లో అదరగొట్టిన ఆయుష్, లక్నోలో కీ ప్లేయర్‌గా మారిపోయాడు...