ఏంది కేన్ మామ ఇది! సన్‌రైజర్స్‌కి ఆడడం ఇష్టం లేదా? ఇలా ఆడడం కంటే...
ఐపీఎల్ 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్‌ని తప్పించి, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కేన్ విలియంసన్‌ని నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది టీమ్ మేనేజ్‌మెంట్. అయితే ఈ నిర్ణయం వల్ల ఇప్పటిదాకా ఆరెంజ్ ఆర్మీకి కలిసి వచ్చిందంటూ ఏమీ లేదు...

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంచి ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం డేవిడ్ వార్నర్. ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ భారమంతా మోసిన డేవిడ్ వార్నర్, 2014 నుంచి 2020 వరకూ ప్రతీ సీజన్‌లోనూ 500+ పరుగులు చేశాడు...
రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన డేవిడ్ వార్నర్, బౌలర్లను అద్భుతంగా వాడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించేవాడు...
అయితే ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో ఆడిన 6 మ్యాచుల్లో 194 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, టీమ్ సెలక్షన్ గురించి చేసిన కామెంట్లతో కెప్టెన్సీ కోల్పోయి, జట్టుకి దూరం కావాల్సి వచ్చింది..
డేవిడ్ వార్నర్ స్థానంలో ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఫైనల్ చేర్చిన కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ అప్పగించింది టీమ్ మేనేజ్‌మెంట్. అయితే కేన్ మామ కూడా సన్‌రైజర్స్‌ని విజయాల బాట పట్టించలేకపోతున్నాడు...
2015 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్న కేన్ విలియంసన్, ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన రేంజ్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేకపోయాడు...
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా 7 బంతుల్లో 2 పరుగులు చేసి అవుటైన కేన్ విలియంసన్, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓ వైపు యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ హిట్టింగ్‌కి దిగి, షాట్లు ఆడుతుంటే కేన్ మామ, అతనికి స్ట్రైయిక్ ఇవ్వడానికి కూడా ఇబ్బందిపడ్డాడు.
కేన్ విలియంసన్‌కి ఓపెనర్‌గా చెప్పుకోదగ్గ రికార్డు లేదు. జట్టులో అయిడిన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ వంటి హిట్టింగ్ ఓపెనర్లు ఉన్నారు...
కేన్ మామ వన్‌డౌన్‌లో బాగా ఆడగలడు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్, డేవిడ్ వార్నర్‌ని ఆడించినట్టుగా ఓపెనర్‌గా ఆడించాలని భావించడంతో కేన్ విలియంసన్ ఇబ్బంది పడుతున్నాడు...
దూకుడుగా ఆడలేక, తన స్టైల్‌లో ఆడలేక టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడుతూ... టీమ్‌ని విజయాల భాట పట్టించలేకపోతున్నాడు కేన్ విలియంసన్... చూస్తుంటే పైసల కోసం ఆడుతున్నట్టు ఉంది కానీ కేన్ విలియంసన్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడడం కూడా ఇష్టం లేనట్టుగా ఉందని అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్..