నేను ఆ పొజిషన్‌లో ఉంటే ఓ హాస్పిటల్ కట్టిస్తా... మహ్మద్ సిరాజ్ కామెంట్...
ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో భాగంగా మహ్మద్ సిరాజ్‌ని రూ.7 కోట్లకు రిటైన్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ, సిరాజ్‌కి రూ.10 కోట్ల ఆఫర్ ఇచ్చినా, విరాట్ కోసం దాన్ని తిరస్కరించాడని టాక్ కూడా వినిపించింది. ఇవన్నీ పక్కనబెడితే తన మంచి మనసుతో అందరి మనసు దోచుకుంటూనే ఉన్నాడు హైదరాబాదీ సిరాజ్ మియ్యా...

క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీని ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోతో పోలుస్తారు చాలామంది. దాదాపు 190 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న విరాట్, పోర్చుగ్రీస్ సాకర్ ప్లేయర్ రొనాల్డో, లియోనెల్ మెస్సీ తర్వాత మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా నిలిచాడు...
ఫిట్‌నెస్ విషయంలో క్రిస్టియానో రొనాల్డోని ఫాలో అయ్యే విరాట్ కోహ్లీని పంజాబ్ కింగ్స్ క్రికెటర్ భనుక రాజపక్ష.. ‘క్రికెట్ క్రిస్టియానో రొనాల్డో’గా అభివర్ణించాడు...
తాజాగా ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీని తన ఫెవరెట్ అథ్లెట్ ఎవరని ప్రశ్నించింది. దానికి విరాట్ వెంటనే క్రిస్టియానో రొనాల్డో అని సమాధానం ఇచ్చాడు...
Cristiano Ronaldo
‘మీరు ఓ రోజు క్రిస్టియానో రొనాల్డోగా మారితే ఏం చేస్తారు’ అని మరో ప్రశ్న విరాట్‌కి వచ్చింది. దానికి కోహ్లీ వెంటనే... ‘అప్పుడు నేను నా బ్రెయిన్‌ని స్కాన్ చేస్తా. ఇంత ప్రెషర్‌ని ఎలా తట్టుకుంటుందో ఆ సీక్రెట్ తెలుసుకుంటా...’ అని సమాధానం ఇచ్చాడు...
వికెట్ తీసిన తర్వాత రొనాల్డో సెలబ్రేషన్స్‌తో రెచ్చిపోయే ఆర్‌సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా తన ఫెవరెట్ అథ్లెట్‌గా అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ పేరే చెప్పాడు...
‘మీరు ఓ రోజు రొనాల్డోగా మారితే ఏం చేస్తారనే’ ప్రశ్నకు... ‘నేను ఆ పొజిషన్‌లోకి వెళితే ఓ పెద్ద ఆసుపత్రి కట్టిస్తా. అందులో ప్రతీ సౌకర్యం ఉచితంగా ఉంటుంది...
కరోనా వల్ల జనాలు ఇబ్బందిపడడం కళ్లారా చూశాను. అలాంటి సమస్య మళ్లీ రాకుండా చూస్తా...’ అంటూ హత్తుకునే సమాధానం ఇచ్చాడు మహ్మద్ సిరాజ్..