- Home
- Feature
- Prawns City: భారతదేశ రొయ్యల రాజధాని నగరం ఇది.. ఆంధ్రప్రదేశ్లోని ఈ నగరం రొయ్యలకు చాలా స్పెషల్
Prawns City: భారతదేశ రొయ్యల రాజధాని నగరం ఇది.. ఆంధ్రప్రదేశ్లోని ఈ నగరం రొయ్యలకు చాలా స్పెషల్
Prawns City: నాన్ వెజ్ ప్రియులకు రొయ్యలంటే ఎంతో ఇష్టం ఉంటుంది. భారతదేశ రొయ్యల రాజధాని ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. దీన్ని ష్రింప్ సిటీ అని, ష్రింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. తెలుగులో రొయ్యల రాజధానిగా పిలుచుకోవచ్చు.

రొయ్యల రాజధాని ఈ నగరం
ఆంధ్రప్రదేశ్లో రొయ్యలకు చాలా డిమాండ్. విదేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి అవుతాయి.అయితే మనదేశంలో భారతదేశ రొయ్యల రాజధానిగా పిలుచుకునే ఈ నగరంలో టేస్టీ రొయ్యలు దొరుకుతాయి. ఆ నగరం ఇంకేదో కాదు నెల్లూరు జిల్లా. దీన్ని "రొయ్యల రాజధాని" (ష్రింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా) అని పిలుస్తారు. భారతదేశంలో 1980వ దశకంలో మొదలైన "బ్లూ రెవల్యూషన్" లేదా నీలి విప్లవానికి నెల్లూరు ప్రధాన కేంద్ర బిందువుగా నిలిచింది. ఇక్కడి సుదీర్ఘమైన సముద్ర తీరం, స్వర్ణముఖి, పెన్నా నదీ ముఖద్వారాలు, ఉప్పునీటి సరస్సులు... రొయ్యల సాగుకు అద్భుత వాతావరణాన్ని అందించాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యాపారాల కోసం అధికంగా రొయ్యల చెరువులను తవ్వి, ఆధునిక ఆక్వా విప్లవానికి నాంది పలికిన ఘనత నెల్లూరుకే సొంతమైంది.
ఇతర దేశాలకు ఎగుమతి
నెల్లూరులో ప్రాసెస్ చేసిన రొయ్యలకు ప్రపంచ మార్కెట్లలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో నెల్లూరు నుంచి ఎగుమతి అయ్యే నాణ్యమైన టైగర్ ప్రాన్స్, వెనామీ రొయ్యలకు భారీ గిరాకీ ఉంటుంది. జిల్లాలో వేలాది హెక్టార్లలో వ్యాపించిన చెరువులు, వందలాది హేచరీలు, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అత్యాధునిక కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు విస్తరించి ఉన్నాయి. స్థానిక రైతులు కొత్త విజ్ఞానాన్ని, శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తిని సాధించడంతో దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే అతిపెద్ద ఎగుమతి కేంద్రాలలో ఒకటిగా నెల్లూరు అభివృద్ధి చెందింది.
ఎంతోమంది కోటీశ్వరులు
రొయ్యల సాగు నెల్లూరు జిల్లా గ్రామీణ పరిస్థితులుకు పూర్తిగా మార్చేసింది. వ్యవసాయంపై మాత్రమే ఆధారపడిన అనేకమంది సాధారణ రైతులు ఈ వ్యాపారంతో కోటీశ్వరులుగా ఎదిగారు. లక్షలాది మంది కూలీలకు, కార్మికులకు ఉపాధిని దొరుకుతోంది. ప్రపంచంలోని ప్రసిద్ధ అంతర్జాతీయ సీఫుడ్ రెస్టారెంట్లలో నెల్లూరు రొయ్యలు రుచికరమైన ప్రధాన ఆహారంగా మారాయి. భారతీయ ఆక్వా రంగంలో తనదైన ముద్రవేయడంతో పాటూ, మన దేశానికి బిలియన్ డాలర్ల విదేశీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది నెల్లూరు.





