జింబాబ్వేతో మ్యాచ్ వర్షం పడి రద్దయితే టీమిండియా పరిస్థితి ఏంటి... టీ20 వరల్డ్ కప్‌లో...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ గ్రూప్ మ్యాచ్‌లు క్లైమాక్స్‌కి చేరుకున్నాయి. గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్‌కి అర్హత సాధించగా మరో ప్లేస్ కోసం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య పోటీ నడుస్తోంది. ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ ఫలితం రెండో సెమీ ఫైనలిస్ట్‌ని డిసైడ్ చేయనుంది...
rohit rahul
గ్రూప్ 1తో పోలిస్తే గ్రూప్ 2 మరింత ఆసక్తికరంగా మారింది. టీమిండియా 3 మ్యాచుల్లో గెలిచి 6 పాయింట్లతో టాప్‌లో ఉంటే సౌతాఫ్రికా 5 పాయింట్లతో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు నాలుగేసి పాయింట్లతో సెమీ ఫైనల్ రేసులో నిలిచాయి...
ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో పోటీపడుతుంటే...సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఓడిపోతే పాక్- బంగ్లా మ్యాచ్‌లో గెలిచే జట్టు సెమీస్ చేరుతుంది...
pakistan
6 పాయింట్లతో ఉన్న ఇండియా, జింబాబ్వేతో మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా టీమిండియా ఖాతాలో 7 పాయింట్లు ఉంటాయి. దీంతో సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌పై గెలిస్తే 7 పాయింట్లు సాధిస్తుంది. దీంతో ఇండియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్ చేరతాయి.
Image credit: Getty
అయితే జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే 8 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా గ్రూప్ స్టేజీని ముగుస్తుంది. దీంతో గ్రూప్ 1లో ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్‌లతో సెమీ ఫైనల్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌లో తలబడాల్సి ఉంటుంది..
Image credit: Getty
ఒకవేళ జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే... 6 పాయింట్లతో ఉన్న భారత జట్టు సెమీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. 4 పాయింట్లతో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ విజేతతో నెట్ రన్ రేట్‌తో పోటీ పడాల్సి ఉంటుంది.