నా వరకూ విరాట్ కోహ్లీయే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కామెంట్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని ఒంటి చేత్తో గెలిపించిన విరాట్ కోహ్లీ, 6 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలు చేసి 296 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
Image credit: Getty
2014 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 319 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు విరాట్ కోహ్లీ...
సచిన్ టెండూల్కర్ వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఈ ఫీట్ సాధించాడు. 1996, 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ రెండు సార్లు ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు...
Virat Kohli
పాకిస్తాన్ బౌలర్లను ఎదుర్కొంటూ డెత్ ఓవర్లలో దూకుడుగా పరుగులు చేయలేకపోయారు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ బ్యాటర్లు. ఇంగ్లాండ్ బ్యాటర్లు, పాకిస్తాన్‌పై చివరి 18 బంతుల్లో 28 పరుగులు చేస్తే... విరాట్ కోహ్లీ ఒక్కడే 279 స్ట్రైయిక్ రేటుతో 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు...
అయితే టోర్నీలో 296 పరుగులు చేసినప్పటికీ, స్లోగా ఆడాడనే ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది విరాట్ కోహ్లీ. కారణం రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్ కావడమే. తమ ఫెవరెట్ క్రికెటర్ ఒక్కడే ట్రోల్స్ ఎదుర్కోవడం ఇష్టం లేక, విరాట్ కోహ్లీ స్ట్రైయిక్ రేటును టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు చాలామంది హిట్ మ్యాన్ ఫ్యాన్స్...
అయితే ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాటర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ దక్కాల్సిందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. 98.67 సగటుతో పరుగులు చేసిన విరాట్ కోహ్లీని పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదని అన్నాడు...
virat kohli
‘గొప్ప ఆటగాళ్లు, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకుని గొప్పగా ఆడతారు. పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్, వరల్డ్ కప్ టోర్నీకే హైలైట్... నా వరకూ విరాట్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్... ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ టాపార్డర్ ఫెయిల్ అయ్యాక విరాట్ బాధ్యత తీసుకుని ఆడాడు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...
Sam Currun
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 13 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది. ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన కుర్రాన్, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ గెలిచిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.