సెమీ ఫైనల్ ఓటమి తర్వాత ముసిముసి నవ్వులు... సూర్య, ద్రావిడ్, అక్షర్ పటేల్ ఒక్కడికీ బాధ లేదు...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది. టీమిండియా విధించిన 168 పరుగుల టార్గెట్‌ని వికెట్ నష్టపోకుండా ఛేదించి రికార్డు విజయం అందుకుంది ఇంగ్లాండ్. 15 ఏళ్ల తర్వాత టీమిండియా, టీ20 వరల్డ్ కప్ గెలవబోతుందని నమ్మకం పెట్టుకున్న అభిమానులు, ఈ ఓటమితో తీవ్ర నిరాశకు లోనయ్యారు...
2014 టీ20 వరల్డ్ కప్ నుంచి ఐసీసీ టైటిల్ కోసం ఆశగా ఎదురుచూస్తూ వస్తోంది భారత జట్టు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఐసీసీ టైటిల్ గెలవలేకపోయిన భారత జట్టు, రోహిత్ శర్మ కెప్టెన్సీలో మ్యాజిక్ చేస్తుందని అనుకున్నారంతా. ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన రోహిత్, టీమిండియాకి వరల్డ్ కప్ తెస్తాడని భారీ ఆశలు పెట్టుకున్నారు...
india
లక్కీగా సెమీ ఫైనల్ చేరిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌ని ఓడించి ఫైనల్ చేరడంతో ఇండియా, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుందని ఫిక్స్ అయ్యారు. దాయాదుల మధ్య ఫైనల్ ఫైట్ ఓ రేంజ్ సాగుతుందని, భారత జట్టు గత ఏడాది ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటుందని ఎన్నో, ఎన్నెన్నో అంచనాలు... పెరిగిపోయాయి.
అయితే సెమీ ఫైనల్‌లో ఒక్క వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు, ఇంగ్లాండ్‌కి 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందించారు. ఈ పరాజయం, సగటు క్రికెట్ అభిమానిని తీవ్ర నిరుత్సాహానికి, నిరాశకి గురి చేసింది...
rohit sharma
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ డగౌట్‌లో కూర్చోని కన్నీళ్లు పెట్టుకోవడం, విరాట్ కోహ్లీ మరోసారి నిరాశవదనంతో కుమిలిపోవడం చూసి సగటు భారత క్రికెట్ అభిమాని గుండె తరుక్కుపోయింది. అయితే కొందరు భారత క్రికెటర్లు మాత్రం సెమీ ఫైనల్ ఓటమి తర్వాత చిరునవ్వులు చిందిస్తూ పెవిలియన్ చేరడం కెమెరాల్లో కనబడింది...
Suryakumar Yadav
సెమీస్‌లో బ్యాటింగ్‌లో ఫెయిల్ అయిన సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్ ఇచ్చిన ఓ క్యాచ్‌ని డ్రాప్ చేశాడు. క్యాచ్ నేలపాలు చేసిన తర్వాత చిరునవ్వులు చిందించిన సూర్య, టీమిండియా మ్యాచ్ ఓడిన తర్వాత కూడా నవ్వుతూ పెవిలియన్ చేరాడు...
Image credit: PTI
సూర్యకుమార్ యాదవ్‌తో పాటు టోర్నీల్లో అటు బ్యాటర్‌గా, ఇటు బౌలర్‌గా అట్టర్ ఫ్లాప్ అయిన అక్షర్ పటేల్ కూడా నవ్వుతూ పెవిలియన్‌కి రావడం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. వీళ్లే ఇంత అనుకుంటే భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, టీమిండియా ఓ సాధారణ మ్యాచ్ ఓడిపోయిందన్నట్టుగా ఎంతో కూల్‌గా, డగౌట్‌లో బర్గర్ తింటూ కనిపించాడు...
Image credit: Getty
చూస్తుంటే ఐపీఎల్ అనుభవంతో టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఓడినా కూడా తర్వాతి సీజన్‌లో చూసుకోవచ్చులే అని లైట్ తీసుకునే యాటిట్యూడ్ ప్లేయర్లలో పెరిగిపోయినట్టు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌కే సెమీ ఫైనల్ మ్యాచ్ ఓటమిపై సీరియస్‌నెస్ లేనట్టు తెలుస్తోందని, ఇక మిగిలిన ప్లేయర్లు చిరునవ్వులు చిందించడంలో తప్పు లేదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..