కొత్తగా ఏం జరిగింది... ఎప్పుడూ జరిగేదేగా... అప్పుడు విరాట్, ఇప్పుడు రోహిత్ అంతే తేడా!
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా కథ ముగిసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు, ఫైనల్‌కి అడుగు దూరంలో ఆగిపోయింది. పెద్దగా అంచనాలు లేకుండా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అడుగుపెట్టిన భారత జట్టు, ఆశించిన దాని కంటే ఎక్కువగానే పర్ఫామెన్స్ ఇచ్చింది...
Image credit: Getty
జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా లేకుండా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అడుగుపెట్టింది టీమిండియా. అయితే ఎలా ఆడతారో, ఏం చేస్తారో అనుకున్న భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ... గ్రూప్ మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు...
Suryakumar Yadav
హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి టీమిండియాని సెమీ ఫైనల్ దాకా తీసుకురాగలిగారు. ఎప్పటిలాగే నాకౌట్ మ్యాచుల్లో టీమిండియా స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయింది. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మతో పాటు ‘మ్యాచ్ విన్నర్... మ్యాచ్ విన్నర్’ అంటూ ఆధారపడిన సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరారు...
Rohit Sharma
టీమిండియా పవర్ ప్లేలో 38 పరుగులు చేస్తే, ఇంగ్లాండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసి, టీ20 వరల్డ్ కప్స్‌లో అత్యధిక పవర్ ప్లే స్కోరును నమోదు చేసుకుంది. వెంటవెంటనే టాపార్డర్ బ్యాటర్లు అవుటైనా విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా కారణంగా ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది భారత జట్టు...
Rohit Sharma
ఆడిలైడ్‌లో ఇప్పటిదాకా టాస్ గెలిచిన జట్టు గెలిచింది లేదు. రెండోసారి బ్యాటింగ్ చేసి విజయవంతంగా ఛేదించిన స్కోరు 158 పరుగులే. అయితే టీమిండియా సెమీస్ ఫోబియా, నాకౌట్ ఫివర్, బ్యాడ్‌లక్ ముందు ఇవేవీ పనిచేయలేదు...
rohit sharma
ఇప్పుడు కొత్తగా ఏమీ జరగలేదు. ఎప్పుడూ జరిగేదే జరిగింది. అయితే ఇంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఇలాంటి పరాభవాలు ఎదుర్కొంది. ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, టీమిండియా రాత మారుస్తాడని అనుకుంటే... హిట్ మ్యాన్ అస్త్రాలు, టీమిండియా విషయానికి వచ్చేసరికి వీగిపోయాయి...