ఐపీఎల్ 2023 ఫైనల్ రోజు కండోమ్స్‌కి విపరీతమైన డిమాండ్... ఒక్క రాత్రిలోనే స్విగ్గీలో వేల ఆర్డర్లు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమై 16 సీజన్లు గడిచినా ఐపీఎల్ 2023 సీజన్‌కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మూడు రోజుల పాటు సా........గిందీ ఫైనల్ మ్యాచ్...
Image credit: PTI
షెడ్యూల్ ప్రకారం మే 28న ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ని రిజర్వు డేకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు...
ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా సోమవారం రోజున ఫైనల్ నిర్వహించాల్సి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మళ్లీ వర్షం పడడంతో మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. వర్షం తగ్గినా పిచ్‌ని ఆటకు సిద్ధం చేసేందుకు సరైన వసతులు లేకపోవడంతో రెండు గంటల తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది..
ఈ కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ రిజల్ట్ వచ్చే సమయానికి అర్ధరాత్రి 1 గంట 45 నిమిషాలు అయ్యింది. ఈ సమయంలో కూడా ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌కి రికార్డు స్థాయిలో 3.2 కోట్ల రియల్ టైం వ్యూస్ వచ్చాయి...
ఫైనల్ మ్యాచ్ ఫైనల్ ఓవర్ టైమ్‌లో కూడా రియల్ టైం 2.2 కోట్లుగా నమోదైంది. అంత అర్ధరాత్రి నిద్ర నుంచి తప్పుకోవడానికి సెక్స్‌ని మార్గంగా ఎంచుకున్నారు చాలామంది. బయటికి వెళ్తే మ్యాచ్ అప్‌డేట్స్ మిస్ అవుతామోనని ఆన్‌లైన్ ద్వారా కండోమ్‌లను ఆర్డర్ చేశారు.
ఇలా ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఒక్కరోజే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో 2423 డురెక్స్ కండోమ్‌లు అమ్ముడుపోయాయట. సాధారణంగా వాలెంటైన్స్ రోజు కండోమ్స్‌కి ఈ విధమైన డిమాండ్ ఉంటుంది. కానీ ఐపీఎల్ 2023 సీజన్ దాన్ని అధిగమించిందని అంటున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్...
ఆన్‌లైన్ ద్వారా కండోమ్స్ ఆర్డర్ చేసిన వారిలో ఎక్కవ మంది చెన్నైవారే కాగా ఆ తర్వాతి ప్లేస్‌లో ఫైనల్ ఆడిన రెండు టీమ్స్‌కి సంబంధం లేని హైదరాబాదీలు ఉండడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచిన తర్వాత ఆ సంతోషాన్ని సెక్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నవారి సంఖ్య కూడా భారీగానే ఉందట..
ఇంతకుముందు ఎక్కువగా సంతోషం వస్తే టపాకాయలు కాలుస్తూ, కేక్ కట్ చేస్తూ, లేదా మద్యం తాగుతూ సెలబ్రేట్ చేసుకునేవాళ్లు యూత్. అయితే ఇప్పుడు సెక్స్‌కి మించిన సెలబ్రేషన్స్ ఏమీ లేవని ఆలోచిస్తున్న రసికుల సంఖ్య పెరుగుతోందని ఓ అధ్యయనంలో తేలింది..