SRHvsCSK: టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్.... సీజన్‌లో తొలిసారిగా ఆరెంజ్ ఆర్మీ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... సీజన్‌లో తొలిసారి మొదట బ్యాటింగ్ చేయనున్న ఆరెంజ్ ఆర్మీ...
మనీశ్ పాండే, సందీప్ శర్మ రీఎంట్రీ...
IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సీజన్‌లో మొదటిసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఆడిన ఐదు మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంటే, వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఓదార్పు విజయం అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ విజయం అత్యంత కీలకం కానుంది. నేటి మ్యాచ్‌లో ఓడితే, ఆరెంజ్ ఆర్మీ ఫ్లేఆఫ్ అవకాశాలు చాలా సంక్లిష్టం అవుతాయి.
మరోవైపు గత సీజన్‌లో దారుణమైన ప్రదర్శన తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన సీఎస్‌కే... మొదటి మ్యాచ్‌లో ఓడినా వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి జోరుమీదుంది. సీఎస్‌కే దూకుడుకి సన్‌రైజర్స్ కళ్లెం వేయగలదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న...
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది. నటరాజన్ గాయంతో సీజన్ మొత్తానికి దూరం కాగా భువీ గత మ్యాచ్‌లో ఆడలేదు. అబ్దుల్ సమద్ కూడా గాయపడడంతో మిడిల్ ఆర్డర్ వైఫల్యం తీవ్రంగా వేధిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్:
రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, మొయిన్ ఆలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, సామ్ కుర్రాన్, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, లుంగి ఇంగిడి
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, కేన్ విలియంసన్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, జగదీశ సుచిత్, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ