సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం... బ్రియాన్ లారా ప్లేస్‌లో కొత్త కోచ్‌ని వెతికే పనిలో ఆరెంజ్ ఆర్మీ...
ఏ నిమిషాన డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిందో అప్పటి నుంచే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ పరిస్థితి దారుణంగా తయారైంది. మొదటి 9 సీజన్లలో రెండు సార్లు ఫైనల్స్ చేరి, మరో ఐదు సార్లు ప్లేఆఫ్స్ చేరిన ఆరెంజ్ ఆర్మీ... 2021 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది..
Image credit: PTI
గత మూడు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను మార్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముగ్గురు హెడ్ కోచ్‌లను కూడా మార్చింది. 2021 సీజన్‌లో ట్రేవర్ బేలిస్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తే, 2022 సీజన్‌లో టామ్ మూడీ కోచ్ పొజిషన్‌ని చేపట్టాడు..
Image credit: PTI
2023 సీజన్‌లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాకి హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. టీమ్‌లో స్టార్ ప్లేయర్లు ఉన్నా, సరైన పర్ఫామెన్స్ రాబట్టలేక పాయింట్ల పట్టికలో రెండోసారి ఆఖరి స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
Image credit: PTI
2021-23 మధ్య మూడు సీజన్లలో రెండు సార్లు ఆఖరి పొజిషన్‌లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని 8వ స్థానంలో నిలిచింది. వరుసగా 5 మ్యాచుల్లో నెగ్గిన తర్వాత వరుసగా 6 మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ చేరలేకపోయింది ఆరెంజ్ ఆర్మీ..
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ పేపర్ మీద సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది. అంతేనా కోచింగ్ స్టాఫ్‌లో కూడా దిగ్గజాలు ఉన్నారు. బ్రియాన్ లారా హెడ్ కోచ్‌గా ఉంటే, లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా... సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినా టీమ్ పర్ఫామెన్స్ చూస్తే అట్టర్ ఫ్లాప్..
దీంతో బ్రియాన్ లారాని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించి, అతని పొజిషన్‌లో మరో కోచ్‌ని తెచ్చే ప్రయత్నాలు మొదలెట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్. అదీకాకుండా బ్రియాన్ లారా, వెస్టిండీస్ క్రికెట్ టీమ్‌ని బాగుచేసే పనిని భుజాల పైకి ఎత్తుకున్నాడు..
విండీస్ హెడ్ కోచ్ ఆండీ కోలీతో పాటు బ్రియాన్ లారా కూడా టీమ్‌కి సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో 2024 సీజన్‌లో సన్‌రైజర్స్‌కి బ్రియాన్ లారా అందుబాటులో ఉండకపోవచ్చు. లారా ప్లేస్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కోచ్‌గా వస్తే బాగుంటుందని అంటున్నారు కొందరు ఫ్యాన్స్...
యువీ కంటే డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి 2009లో టైటిల్ అందించిన ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ని హెడ్ కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని అంటున్నారు మరికొందరు అభిమానులు... అయితే మేనేజ్‌మెంట్ మాత్రం మళ్లీ టామ్ మూడీనే హెడ్ కోచ్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండడం కొసమెరుపు..