అశ్విన్‌లాంటి బౌలర్‌ను ఏ దేశమైనా కోరుకుంటుంది... కానీ ఇక్కడ అతనికి జట్టులో చోటే ఉండదు...

First Published Dec 24, 2020, 11:11 AM IST

భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బీసీసీఐ వ్యవహారిస్తున్న ద్వంద్వ విధానాలపై ఫైర్ అయ్యారు. మొదటి ఐపీఎల్ సమయంలోనే తండ్రి అయిన నటరాజన్‌కి పెటర్నిటీ లీవ్ ఇవ్వని బీసీసీఐ, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ముందుగానే ఎందుకు స్వదేశానికి పంపుతోందని ప్రశ్నించిన సునీల్ గవాస్కర్... బౌలర్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రశ్నించాడు.

టీమిండియా తరుపున అత్యధిక వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్...

ప్రపంచంలోనే అత్యధిక వేగంగా 50, 100, 150, 200, 250, 300, 350 వికెట్లను పడగొట్టిన టెస్టు బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...

బ్యాటుతోనూ రాణించి, టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన రవిచంద్రన్ అశ్విన్... 72 మ్యాచుల్లో 370 వికెట్లు పడగొట్టాడు...

‘రవిచంద్రన్ అశ్విన్ లాంటి టాప్ క్లాస్ బౌలర్‌ను ఏ దేశమైనా సాదరంగా ఆహ్వానిస్తుంది...  టెస్టుల్లో అతనికి 350కి పైగా వికెట్లు, 4 సెంచరీలు కూడా ఉన్నాయి...

అయితే టీమిండియాలో మాత్రం అతనికి తగినంత గౌరవం దక్కడం లేదనేది వాస్తవం... ఒక్క మ్యాచ్‌లో వికెట్లు తీయలేకపోతే, అతన్ని పక్కనబెట్టేస్తారు...

అదే స్టార్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు దక్కించుకున్న ప్లేయర్ల విషయంలో ఇలా చేస్తారా? పూజారా, కోహ్లీలాంటి వాళ్లు రెండు మూడు మ్యాచులు ఆడకపోయినా వాళ్లని ఎందుకు పక్కనబెట్టరు...

రవిచంద్రన్ అశ్విన్ విషయంలో మాత్రం బీసీసీఐ రూల్స్ వేరేగా ఉన్నాయి... ’ అని భారత క్రికెట్ బోర్డు విధానాన్ని నిలదీశాడు సునీల్ గవాస్కర్.

టీమిండియా తరుపున 111 వన్డే మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 150 వికెట్లు పడగొట్టాడు. 2017 జూన్‌లో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడిన అశ్విన్, 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

అయితే ఆ తర్వాత భారత వన్డే జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు రవిచంద్రన్ అశ్విన్. టెస్టుల్లో మాత్రం స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు అశ్విన్.

ఛతేశ్వర్ పూజారాను పదిసార్లు అవుట్ చేసిన ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా రవిచంద్రన్ అశ్విన్ తనకు స్ఫూర్తి అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?