- Home
- Sports
- Cricket
- వస్తున్నా నేనే వస్తున్నా.. నన్ను కొనకున్నా వదిలేస్తానా? : ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న స్టీవ్ స్మిత్
వస్తున్నా నేనే వస్తున్నా.. నన్ను కొనకున్నా వదిలేస్తానా? : ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న స్టీవ్ స్మిత్
IPL 2023: 33 ఏండ్ల స్మిత్.. ఐపీఎల్ లో మొత్తంగా 103 మ్యాచ్ లు ఆడాడు. 2012లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్మిత్.. 2021 వరకూ ఐపీఎల్ లో ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తానంటున్నాడు ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి స్టీవ్ స్మిత్. గతేడాది వేలంలో స్మిత్ ను కొనడాడని ఏ ఫ్రాంచైజీ కూడా ధైర్యం చేయలేదు. అయినా తాను మాత్రం ఈ లీగ్ ను వదలనని, త్వరలోనే భారత్ లో ల్యాండ్ కాబోతున్నానని ఓ వీడియో విడుదల చేశాడు.
తాజాగా స్మిత్ తన ట్విటర్ ఖాతా వేదికగా స్పందిస్తూ.. ‘నమస్తే ఇండియా.. నేను మీ కోసం ఓ ఎగ్జయిటింగ్ న్యూస్ చెప్పబోతున్నా. నేను ఈ ఏడాది ఐపీఎల్ లో జాయిన్ కాబోతున్నా. భారత్ లో మోస్ట్ ఎక్సెప్షనల్, ప్యాషనేట్ టీమ్ తో చేతులు కలపబోతున్నా...’అని వీడియోలో పేర్కొన్నాడు.
స్మిత్ ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే నెట్టింట ఇది వైరల్ గా మారింది. అయితే స్మిత్ ఏ టీమ్ లో జాయిన్ కాబోతున్నాడని ఫ్యాన్స్ తెగ వెతుకుతున్నారు. ఏ జట్టు తరఫున ఆడనున్నాడనే విషయం స్పష్టంగా చెప్పనప్పటికీ.. ఈ లీగ్ లో అత్యంత ప్రజాధరణ ఉన్న టీమ్ అన్నాడంటే స్మిత్ కొంపదీసి మా టీమ్ లోని రావడం లేదు కదా.. అని ఆర్సీబీ, చెన్నై, ముంబై అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గత వేలంలో అమ్ముడుపోని స్మిత్ ను ఏ ఫ్రాంచైజీ తీసుకోవడం లేదని, అతడు కామెంటేర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి స్మిత్.. ఏదైనా ఫ్రాంచైజీకి ఆడతాడా లేక కామెంటేటర్ గా ఉంటాడా..? అన్నది త్వరలో తేలనుంది.
33 ఏండ్ల స్మిత్.. ఐపీఎల్ లో మొత్తంగా 103 మ్యాచ్ లు ఆడాడు. 2012లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్మిత్.. 2021 వరకూ ఐపీఎల్ లో ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్, కొచ్చి టస్కర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.
2021 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ.. స్మిత్ ను రూ. 2.20 కోట్లతో దక్కించుకుంది. ఆ సీజన్ లో 8 మ్యాచ్ లు ఆడి 152 పరుగులు చేశాడు. మొత్తంగా ఐపీఎల్ లో 103 మ్యాచ్ లు ఆడి 2,485 రన్స్ సాధించాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ కూడా ఉంది. 2022 వేలంలో స్మిత్ ను కొనడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకురాలేదు.