MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • SRH: తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు.! కాటేరమ్మ కొడుకులకు కళ్లు చెదిరే ఆఫర్..

SRH: తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు.! కాటేరమ్మ కొడుకులకు కళ్లు చెదిరే ఆఫర్..

SRH: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్. ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఓ ఫ్రాంచైజీ కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఆ ఆఫర్‌ను ఇద్దరు ప్లేయర్స్ ఒప్పుకున్నారో.? లేదో..? ఇప్పుడు తెలుసుకుందామా..

2 Min read
Author : Pavithra D
Published : Oct 08 2025, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కళ్లు చెదిరే ఆఫర్
Image Credit : SRH Twitter

కళ్లు చెదిరే ఆఫర్

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, ఓపెనింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు ఓ ఫ్రాంచైజీ కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏడాది పొడవునా తమ ఫ్రాంచైజీ తరపున టీ20 టోర్నమెంట్లు ఆడాలని కోరింది. అంతేకాదు ఏకంగా ఆస్ట్రేలియన్ క్రికెట్‌ను పూర్తిగా విడిచిపెట్టాలని చెప్పిందట. అయితే ఈ ఆఫర్‌ను ఆ ఇద్దరు ప్లేయర్స్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్రికెట్ ఆస్ట్రేలియాను వదిలేయాలి
Image Credit : SRH Twitter

క్రికెట్ ఆస్ట్రేలియాను వదిలేయాలి

ఈ ఇద్దరు ఏడాది పొడవునా అన్ని టీ20 ఫార్మాట్లలో తమ ఫ్రాంచైజీ తరపున ఆడేందుకు.. ఒక్కొక్కరికి 10 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ. 58.2 కోట్లు) ఇచ్చేందుకు సిద్దమైందట. ఈ డీల్ విషయమై సదరు ఫ్రాంచైజీ అనధికారికంగా ఇద్దరి ప్లేయర్స్‌ను సంప్రదించగా.. వారిద్దరూ దీన్ని సున్నితంగా తిరస్కరించి.. తాము ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారట.

35
అన్ని తెలుసు.! కానీ సీక్రెట్ డీల్
Image Credit : SRH Twitter

అన్ని తెలుసు.! కానీ సీక్రెట్ డీల్

ఇలాంటి డీల్స్ ఆటగాళ్ల జీతాలను పెంచేందుకు ఉపయోగపడటమే కాదు.. ఆస్ట్రేలియా ప్రధాన టీ20 లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్‌ను సైతం ప్రైవేటీకరించడానికి ఇది మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ డీల్‌పై ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా, స్టేట్ అసోసియేషన్లు, ప్లేయర్స్ యూనియన్ మధ్య చర్చలు జరిగాయి. కానీ ఒక్కటి కూడా అధికారికంగా వెలువడలేదు.

45
కమ్మిన్స్, హెడ్ ఐపీఎల్ సంపాదన
Image Credit : Cricket Australia Twitter

కమ్మిన్స్, హెడ్ ఐపీఎల్ సంపాదన

ఐపీఎల్ 2024 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే కెప్టెన్‌ ప్యాట్ కమ్మిన్స్‌ను రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. అంతేకాకుండా తన జట్టుకు కెప్టెన్‌గా చేసింది. ఇక ఈ ఏడాది వేలానికి ముందు అతడ్ని ఫ్రాంచైజీ రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక ట్రావిస్ హెడ్ సంపాదన విషయానికొస్తే.. 2024లో SRH అతడ్ని రూ. 6.8 కోట్లకు కొనుగోలు చేయగా.. 2025లో అది కాస్తా రూ. 14 కోట్లకు చేరింది. అటు ఆస్ట్రేలియా అగ్రశ్రేణి స్పోర్ట్స్ అథ్లెట్స్‌తో పోలిస్తే.. ఆ దేశ క్రికెటర్ల సంపాదన చాలా తక్కువ అని తెలుస్తోంది.

55
క్రికెటర్ల సంపాదన తక్కువే..
Image Credit : SRH Twitter

క్రికెటర్ల సంపాదన తక్కువే..

మరోవైపు అగ్రశ్రేణి ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సంపాదనతో పోలిస్తే.. కమ్మిన్స్ ఏడాదికి భారీగానే జీతం వెనకేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ సంవత్సరానికి ఒక్కొక్కరు 1.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 8.74 కోట్లు) సంపాదిస్తే.. కమ్మిన్స్ ఏడాదికి దాదాపుగా 3 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 17.48 కోట్లు) తన జేబులో వేసుకుంటాడు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
IPL 2026: రాజస్థాన్ రాయల్స్ నుంచి ఐదుగురు స్టార్ ప్లేయర్లు అవుట్
Recommended image2
IPL 2026: సంజూ శాంసన్ మాత్ర‌మే కాదు.. రాజస్థాన్ రాయల్స్‌ నుంచి ఐదుగురు ప్లేయ‌ర్లు అవుట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved