ఈసారి కప్పు కొడుతున్నాం, చూస్తూ ఉండండి... సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ బెయిర్ స్టో...
ఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్ మొదలెట్టి, అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ప్లేఆఫ్ చేరడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అలవాటు. గత సీజన్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈసారి ఐపీఎల్ ఛాంపియన్ అవుతుందని అంటున్నాడు ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో...
2013లో డెక్కన్ ఛార్జెర్స్ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 2016లో టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది. 2018లో రన్నరప్‌గా నిలవగా నాలుగుసార్లు ప్లేఆఫ్స్ చేరింది...
టీమిండియాతో జరిగిన మొదటి వన్డేలో 94 పరుగులు చేసిన బెయిర్ స్టో, రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీ చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు... ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు బెయిర్ స్టో...
‘ఐపీఎల్ ఓ అద్భుతమైన టోర్నీ. ప్రపంచంలోని ప్రతీ క్రికెటర్, ఐపీఎల్ ఆడాలని ఆశపడతాడు... ఐపీఎల్ లాంటి టోర్నీలో ఆడడం వల్ల ఆటగాడిగా మంచి పరిణితి సాధించేందుకు అవకాశం దొరుకుతుంది...
గత సీజన్‌లో మేం బాగా ఆడాం. కానీ ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నా... ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అలాంటి సంకేతాలు అందుతున్నాయి...
ఐపీఎల్‌లో పరుగుల వరద పారించే డేవిడ్ వార్నర్‌కి తోడుగా గత సీజన్‌లో దుమ్మురేపిన బెయిర్ స్టో ఓపెనర్లుగా రాబోతున్నారు. 2019 సీజన్‌లో ఈ ఇద్దరూ కలిసి 926 పరుగులు చేశారు.
వచ్చే వారంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కలవబోతున్నా... మంచి ఫామ్‌లో ఉన్న అందరం కలిసి టైటిల్ గెలుస్తామని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు జానీ బెయిర్ స్టో...
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో 16 ఇన్నింగ్స్‌ల్లోనే 5 సార్లు 100+ భాగస్వామ్యం నెలకొల్పారు.
టీ20 సిరీస్‌లో విఫలమైనప్పటికీ వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు జానీ బెయిర్ స్టో. రెండో వన్డేలో 112 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు బెయిర్ స్టో...
జానీ బెయిర్ స్టోతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా మళ్లీ ఫామ్ అందుకుని వన్డేల్లో సెంచరీ బాదాడు. ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ పేసర్ భువీ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు...
జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఒకే మ్యాచ్‌లో 11 వికెట్లు తీసిన రషీద్ ఖాన్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలవడం ఖాయమని చెబుతున్నాడు బెయిర్ స్టో...
ఐపీఎల్ 2021 వేలంలో రూ.2 కోట్లకు కేదార్ జాదవ్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, జగదీశ సుచిత్‌ను, ముజీబ్ వుర్ రెహ్మాన్‌ను కొనుగోలు చేసింది.