- Home
- Sports
- Cricket
- నా వల్లే గంగూలీ బతికిపోయాడు.. లేకుంటే కెప్టెన్సీ పోయేది.. హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
నా వల్లే గంగూలీ బతికిపోయాడు.. లేకుంటే కెప్టెన్సీ పోయేది.. హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
Sourav Ganguly: టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పై హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను లేకుంటే గంగూలీ కెప్టెన్సీకి కూడా గండం వాటిల్లేదని వ్యాఖ్యానించాడు.

టీమిండియాకు కెప్టెన్లుగా చేసిన వారిలో ఆల్ టైం గ్రేట్ అనదగ్గవారిలో గంగూలీ ఒకడు. దాదా భారత సారథి అయ్యాక జట్టు దృక్పథంలో మార్పు తెచ్చాడు. అప్పటిదాకా సాత్వికంగా ఉన్న మన ఆటగాళ్లు.. దూకుడు నేర్చుకున్నది కూడా దాదా సారథ్యంలోనే..
గంగూలీ కెప్టెన్సీలోనే ఎంట్రీ ఇచ్చిన హర్భజన్ సింగ్.. తాజాగా దాదాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన ప్రదర్శన వల్లే దాదా కెప్టెన్సీ పోకుందా ఉందని.. తానే అతడికి అండగా నిలిచానని చెప్పుకొచ్చాడు.
తాజాగా భజ్జీ స్పోర్ట్స్ కీడా తో మాట్లాడుతూ.. ‘గంగూలీ నాకు మద్దతు ఇవ్వకుంటే అతడు కూడా కెప్టెన్ గా తొలగించబడేవాడు. 2001 లో భారత్ లో పర్యటించిన ఆస్ట్రేలియా సిరీస్ ను కూడా నెగ్గి ఉండేవాడు కాదు..
దాదా నా కెరీర్ లోకి దేవుడిలా వచ్చాడు. నాకు పూర్తిగా మద్దతుగా నిలిచి అవకాశాలు కల్పించాడు. ఎంత దాదా అవకాశమిచ్చినా నన్ను నేను నిరూపించుకోవాలి కదా. నేను భాగా రాణించడం దాదాకు కూడా కలిసొచ్చింది...’ అని తెలిపాడు.
2001 లో ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించిన విషయం తెలిసిందే. మూడు మ్యాచుల ఆ సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. 3 మ్యాచులలో కలిపి భజ్జీ ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఆ సిరీస్ తర్వాత భజ్జీ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
కాగా.. అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ మీద భజ్జీ ఫైర్ అయ్యాడు. అతడి వల్లే భారత జట్టు 2007 వన్డే ప్రపంచకప్ లో దారుణంగా ఫెయిల్ అయిందని.. చాపెల్ లేకుంటే భారత్ ఇంకా మెరుగ్గా ఆడి ఉండేదని చెప్పుకొచ్చాడు.
‘గ్రెగ్ చాపెల్ ఇండియా కోచ్ అయి ఉండకుంటే మేము 2007 వన్డే ప్రపంచకప్ లో కచ్చితంగా మరింత భాగా ఆడేవాళ్లం. అతడు హెడ్ కోచ్ గా ఉన్నప్పడు జట్టులో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. జట్టు సమన్వయాన్ని అతడు దారుణంగా దెబ్బతీశాడు..’ అని భజ్జీ వివరించాడు.