MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • ఇదేం కొట్టుడు సామీ.. ఆస్ట్రేలియాను కంగారెత్తించారు ! స్మృతి మంధాన సునామీ బ్యాటింగ్

ఇదేం కొట్టుడు సామీ.. ఆస్ట్రేలియాను కంగారెత్తించారు ! స్మృతి మంధాన సునామీ బ్యాటింగ్

Smriti Mandhana : భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఆస్ట్రేలియా బౌలింగ్ ను దంచికొట్టింది. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన భారత మహిళా క్రికెటర్ గా స్మృతి మంధాన రికార్డు సాధించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 20 2025, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారత్ ఆస్ట్రేలియా మూడో వన్డేలో పరుగుల వర్షం
Image Credit : Insta/indiancricketteam

భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డేలో పరుగుల వర్షం

భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డేలో పరుగుల వర్షం కురుస్తోంది. ఢిల్లీలోని అరు‍ణ్ జేట్లీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మహిళల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన సునామీ బ్యాటింగ్ తో ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ గా రికార్డు సాధించింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ జట్టు దూకుడు ఆరంభించింది. ఈ మ్యాచ్‌లోస్మృతి మంధాన ధనాధన్ బ్యాటింగ్ తో రికార్డుల మోత మోగించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆస్ట్రేలియా 412 పరుగులతో రికార్డు స్కోరు
Image Credit : X/AusWomen

ఆస్ట్రేలియా 412 పరుగులతో రికార్డు స్కోరు

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ జార్జియా వాల్ 81 పరుగులతో జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చింది. మధ్యలో బెత్ మూనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 75 బంతుల్లో 138 పరుగులు చేసి మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచింది. 23 ఫోర్లు, 1 సిక్స్‌తో ఆమె రికార్డు ఇన్నింగ్స్ ఆడింది. ఎల్లీస్ పెర్రీ 68, అష్లే గార్డ్నర్ 39 పరుగులు జోడించారు. మొత్తం 47.5 ఓవర్లలో ఆస్ట్రేలియా 412 పరుగులకు ఆలౌటైంది.

Related Articles

Related image1
బెత్ మూనీ రికార్డు సెంచరీ.. చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
Related image2
ధోనీ రికార్డు బద్దలుకొట్టిన సంజూ శాంసన్
36
భారత బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు
Image Credit : X/BCCIWomen

భారత బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు

భారత బౌలర్లు వికెట్లు తీయడంలో విజయవంతమైనా పరుగులను కట్టడి చేయలేకపోయారు. అరుంధతి రెడ్డి 86 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. స్నేహ్ రాణా, క్రాంతి గౌర్ చెరో వికెట్ అందించారు. కానీ ఆస్ట్రేలియా స్కోరు ఇప్పటికే భారత జట్టుకు పెద్ద సవాలుగా మారింది.

46
స్మృతి మంధాన బ్యాటింగ్ విధ్వంసం
Image Credit : insta/indiancricketteam

స్మృతి మంధాన బ్యాటింగ్ విధ్వంసం

ఛేజింగ్ లో భారత ఇన్నింగ్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ప్రియాంక రావల్ (10), హర్లీన్ డియోల్ (11) తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. కానీ స్మృతి మంధాన దూకుడు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. 23 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో రికార్డు హాఫ్ సెంచరీ సాధించింది. ఆష్లే గార్డ్నర్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టి మైలురాయిని చేరుకుంది. ఇది మహిళల వన్డేల్లో భారత తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీగా నిలిచింది. 

ఇంతటితో ఆగకుండా మంధాన 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసింది. దీంతో ఆమె వన్డేల్లో భారత క్రికెటర్లలోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్ లోకి చేరింది. మంధాన 63 బంతుల్లో 125 పరుగుల నాక్ ఆడారు. 17 ఫోర్లు, 5 సిక్సర్లు బాదారు.

56
వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు కొట్టిన టాప్ 5 భారత ప్లేయర్లు
Image Credit : Insta/indiancricketteam

వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు కొట్టిన టాప్ 5 భారత ప్లేయర్లు

మహిళల వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో మంధాన కొత్త రికార్డు నెలకొల్పింది.

  1. స్మృతి మంధాన – 23 బంతులు vs ఆస్ట్రేలియా (2025)
  2. రిచా ఘోష్ – 26 బంతులు vs న్యూజిలాండ్ (2021-22)
  3. వేద కృష్ణమూర్తి – 32 బంతులు vs దక్షిణాఫ్రికా (2017-18)
  4. హర్మన్‌ప్రీత్ కౌర్ – 33 బంతులు vs దక్షిణాఫ్రికా (2020-21)
  5. సబ్బినేని మేఘన – 33 బంతులు vs న్యూజిలాండ్ (2021-22)
66
భారత క్రికెటర్లలో (పురుషులు-మహిళలు కలిపి) ఫాస్టెస్ట్ సెంచరీలు కొట్టలిన ప్లేయర్లు వీరే
Image Credit : ANI

భారత క్రికెటర్లలో (పురుషులు-మహిళలు కలిపి) ఫాస్టెస్ట్ సెంచరీలు కొట్టలిన ప్లేయర్లు వీరే

భారత క్రికెట్ లో ఫాస్టెస్ట్ వన్డే సెంచరీలు

  1. 50 బంతులు – స్మృతి మంధాన vs ఆస్ట్రేలియా (2025)
  2. 52 బంతులు – విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియా (2013)
  3. 60 బంతులు – వీరేంద్ర సెహ్వాగ్ vs న్యూజిలాండ్ (2009)
  4. 61 బంతులు – విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియా (2013)
  5. 62 బంతులు – మొహమ్మద్ అజహరుద్దీన్ vs న్యూజిలాండ్ (1988)
  6.  62 బంతులు – కేఎల్ రాహుల్ vs నెదర్లాండ్స్ (2023)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
బెత్ మూనీ రికార్డు సెంచరీ.. చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
Recommended image2
ధోనీ రికార్డు బద్దలుకొట్టిన సంజూ శాంసన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved