శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్.. బిత్తరపోయిన రిషబ్ పంత్
Shubman Gill shocks Rishabh Pant : 2022 తర్వాత తొలిసారి రెడ్ బాల్ మ్యాచ్ ఆడుతున్న భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కు బిగ్ షాకిచ్చాడు శుభ్‌మన్ గిల్. దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించగా, గిల్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో దాన్ని చూసి బిత్తరపోవడం పంత్ వంతు అయింది.
Shubman Gill, Rishabh Pant
Shubman Gill shocks Rishabh Pant : దులీప్ ట్రోపీతో దేశవాళీ క్రికెట్ సీజన్ షూరు అయింది. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో భారత జట్టు స్టార్ ప్లేయర్లతో పాటు యంగ్ ప్లేయర్లు ఆడుతున్నారు. గతంలో మాదిరి కాకుండా బీసీసీఐ ఈ సారి నాలుగు టీమ్ లుగా భారత ప్లేయర్లను విభజించింది.
ఇండియా ఏ, ఇండియా బీ, ఇండియా సీ, ఇండియా డీ పేర్లతో నాలుగు టీమ్ లను ఏర్పాటు చేసి దులీప్ ట్రోఫీని నిర్వహిస్తోంది. రాబిన్ రౌండ్ తరహాలో నిర్వహిస్తున్న ఈ టోర్నీమొత్తం ముగిసిన తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది.
దులీప్ ట్రోఫీ గురువారం ఘనంగా ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ కు బిగ్ షాకిచ్చాడు శుభ్ మన్ గిల్. 2022 తర్వాత తొలిసారిగా రెడ్ బాల్ మ్యాచ్ ఆడుతున్న భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయడాని వచ్చాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు.
బంతి గాల్లోకి ఎగిరింది. ఇండియా ఏ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, ఎవరూ ఊహించని విధంగా గాల్లోకి వెళ్లిన బంతి కోసం గిల్ వెనక్కి పరుగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా రిషబ్ పంత్ తో పాటు స్టేడియం మొత్తం షాక్ అయింది.
Rishabh Pant
శుభ్ మన్ గిల్ అందుకున్న ఈ సూపర్ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమన్యు ఈశ్వరన్ నేతృత్వంలోని ఇండియా బీ జట్టులో రిషబ్ పంత్ 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. బెంగళూరులోని ఏం చిన్నస్వామి స్టేడియంలో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని ఇండియా ఏ జట్టుతో భారత్ బీ జట్టు దులీప్ ట్రోఫీ మ్యాచ్ లో ఈ సూపర్ క్యాచ్ దృశ్యం కనిపించింది.
రిషబ్ పంత్ ఎప్పటిలాగే రిస్క్ తీసుకుని రిస్కీ షాట్ ఆడాడు, కానీ ఈసారి అదృష్టం అతనికి కలిసిరాలేదు. పంత్ 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. మ్యాచ్ 37వ ఓవర్‌లో పంత్ ఆన్‌సైడ్ వైపు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, బంతి బ్యాట్‌కు సరిగ్గా తాకకపోవడంతో ఎడ్జ్‌ను తీసుకుని గాలిలోకి వెళ్లింది.
శుభ్‌మాన్ గిల్ బంతిపై ఓ కన్నేసి ఉంచాడు.. వెనుకకు పరుగెత్తుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌ని పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గిల్ క్యాచ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
కాగా, మ్యాచ్‌లో రిషబ్ పంత్ తన ఇన్నింగ్స్‌ను అద్భుతమైన కవర్ డ్రైవ్‌తో ప్రారంభించాడు. ఫోర్ రూపంలో పరుగులు వచ్చాయి. అయితే, 5వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ 10 బంతులు మాత్రమే ఆడి క్రీజులో ఎక్కువ సేపు నిలవకుండా ఔట్ అయ్యాడు.
2022లో జరిగిన ఘోరమైన కారు ప్రమాదం తర్వాత క్రికెట్ ఫీల్డ్‌లోకి తిరిగి వచ్చిన పంత్.. దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను అందించాలని చూస్తున్నాడు. ఇక్కడ మంచి ప్రదర్శన చేస్తే రిషబ్ పంత్ మళ్లీ టెస్టు జట్టులోకి రావడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్ లతో సిరీస్‌తో ప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది ప్లేయర్లకు దులీప్ ట్రోఫీ చాలా కీలకం. భారత్ తన రాబోయే సీజన్‌లో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. దులీప్ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేసిన ప్లేయర్లు భారత జట్టులో చోటుదక్కడంతో పాటు రాబోయే సీజన్ మొత్తం జట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి.