MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • రూ.450 కోట్ల స్కాం.. శుభ్‌మన్ గిల్‌ సహా నలుగురు గుజరాత్ ప్లేయర్లకు సీఐడీ నోటీసులు?

రూ.450 కోట్ల స్కాం.. శుభ్‌మన్ గిల్‌ సహా నలుగురు గుజరాత్ ప్లేయర్లకు సీఐడీ నోటీసులు?

Rs 450 crore chit fund scam: రూ.450 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్ కేసులో శుభ్ మ‌న్ గిల్ తో స‌హా నలుగురు గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాళ్లకు సీఐడీ సమన్లు అందించ‌నుంద‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అసలు ఏంటి కేసు? 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 04 2025, 09:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Shubman Gill in ₹450 crore chit fund fraud case: గుజరాత్‌లో ₹450 కోట్ల చిట్ పండ్ మోసం కేసులో భారత స్టార్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ సహా ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ టీమ్ లోని మరో నలుగురు ప్లేయర్ల పేర్లు ఉన్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పోంజీ స్కామ్‌ సెగ క్రికెటర్లనూ తాకడంలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

ఈ కేసును గుజరాత్ CID పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శుభ్ మన్ గిల్ తో పాటు సాయి సుదర్శన్, రాహుల్ తివేటియా, మోహిత్ శర్మ పేర్లు కూడా ఉన్నాయి. నలుగురు క్రికెటర్లకు సమన్లు జారీ చేయాలని గుజరాత్ CID పోలీసులు భావిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రూ.450 కోట్ల చిట్‌ఫండ్‌ కుంభకోణంలో గుజరాత్ ప్లేయర్లు 

ఇటీవల, రూ.450 కోట్ల చిట్‌ఫండ్‌ కుంభకోణానికి సంబంధించి ప్రధాన నిందితుడైన భూపేంద్రసింగ్ జాలాను అధికారులు విచారించారు. బ్యాంకులు అందించే దాని కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లను సేకరించిన భూపేంద్ర సింగ్ ఝలాను గుజరాత్ సీఐడీ అరెస్ట్‌ విచారించగా క్రికెటర్ల అంశం బయటకు వచ్చిందని సమాచారం. 

ఈ చిట్‌ఫండ్‌  లో క్రికెటర్లు శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తివేటియా, మోహిత్ శర్మ పెట్టుబడి పెట్టారు. భూపేంద్రసింగ్ జాలా వాంగ్మూలం ఆధారంగా మోసానికి సంబంధించి క్రికెటర్లపై గుజరాత్ CID పోలీసులు చర్యలు తీసుకోనున్నారని సమాచారం.

ప్రస్తుతం శుభ్ మన్ గిల్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ స్థానంలో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వస్తారు. ఆ తర్వాత శుభ్ మన్ గిల్ తో పాటు నలుగురు క్రికెటర్లకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.

35

₹450 కోట్ల చిట్ ఫండ్ మోసం ఎలా జరిగింది?

గుజరాత్ సీఐడీ ప్రకారం.. థలోత్, హిమ్మత్‌నగర్, వడోదరతో సహా గుజరాత్‌లోని వివిధ జిల్లాల్లో కార్యాలయాలను ప్రారంభించారు. పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించడానికి అనేక మంది ఏజెంట్లను నియమించాడు. ICICI బ్యాంక్, IFC బ్యాంక్ ద్వారా ₹6,000 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2024 IPLలో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా ₹1.95 కోట్లు పెట్టుబడి పెట్టాడు.

మోహిత్ శర్మ, సాయి సుదర్శన్, రాహుల్ తేవాటియా లకు తక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టారు. సంబంధిత విషయాలపై క్రికెటర్లు ఇంకా ఎవరూ స్పందించలేదు. పెట్టుబడులను సేకరించిన సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో పలువురు ఫిర్యాదు చేయడంలో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 

45

విచారణకు క్రికెటర్ల సహకారం ఉంటుందా?

అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (CID-క్రైమ్) పరీక్షిత్ రాథోడ్ మాట్లాడుతూ.. ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించినట్లు జాలా కంపెనీ అయిన పిజెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజెంట్లు తెలిపారు. మోసం ఫిర్యాదులు రావడంతో CID దర్యాప్తు ప్రారంభించింది. అప్పుడు జాలా పరారయ్యాడు. ఒక నెల తర్వాత అంటే డిసెంబర్ 27న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో అతన్ని అరెస్టు చేశారు. జనవరి 4 వరకు జాలాను కస్టడీలో ఉంచారు. ఈ కేసులో మరో ఏడుగురిని కూడా అరెస్టు చేసినట్టు తెలిపాడు. .

55
Gujarat Titans, Shubman Gill

Gujarat Titans, Shubman Gill

పోంజీ స్కామ్.. ఎవ‌రీ భూపేంద్రసింగ్ జలా? 

 రూ. 450 కోట్ల పోంజీ స్కీమ్ ప్ర‌ధాన‌ ఆపరేటర్ భూపేంద్రసింగ్ జలా. అత‌ను గుజరాత్‌లోని సబర్‌కాంతలోని హిమ్మత్‌నగర్ పట్టణానికి చెందినవాడు. 2020-2024 మధ్య తన సంస్థ BZ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా 11,000 మందికి పైగా పెట్టుబడిదారుల నుండి వేల‌కోట్ల‌ను సేక‌రించారు. దాదాపు రూ. 450 కోట్ల స్కామ్ కు పాల్ప‌డ్డారని గుర్తించారు. బ్యాంకులు ఇచ్చే వ‌డ్డీ కంటే అధికంగా వ‌డ్డీ అందిస్తామ‌ని చెప్పి పెట్టుబడిదారులను ఆకర్షించాడు. ప్రారంభంలో వారి విశ్వాసాన్ని పొందేందుకు ఈ వాగ్దానాలను నెరవేర్చాడు. అయితే, సంస్థ ప‌నితీరుపై అనుమానంతో ప‌లువురు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో ఈ భారీ మోసం వెలుగులోకి వ‌చ్చింది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved