- Home
- Sports
- Cricket
- టీమ్‌లో ఉండాలంటే ఇలా ఆడితే సరిపోదు... శ్రేయాస్ అయ్యర్‌పై భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్...
టీమ్‌లో ఉండాలంటే ఇలా ఆడితే సరిపోదు... శ్రేయాస్ అయ్యర్‌పై భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్...
టీమిండియాలో వచ్చిన కొత్తలో నిలకడైన ఆటతీరుతో ఫ్యూచర్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. అయితే గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, రీఎంట్రీ తర్వాత తుదిజట్టులో చోటు దక్కించుకోవడానికి కూడా నానా కష్టాలు పడుతున్నాడు...

Image credit: PTI
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్, ఇంగ్లాండ్ టూర్‌లో ఐదో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పెద్దగా మెప్పించలేకపోయాడు...
Shreyas Iyer
శ్రేయాస్ అయ్యర్‌కి ఉన్న షార్ట్ బాల్ వీక్‌నెస్‌ని పసిగట్టిన ఇంగ్లాండ్ టెస్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, డగౌట్ ద్వారా సిగ్నల్స్ ఇచ్చి... కేకేఆర్ కెప్టెన్ త్వరగా అవుట్ అయ్యేందుకు కారణమయ్యాడు...
Shreyas Iyer-Shikhar Dhawan
శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకి దూరం కావడం, అదే సమయంలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్... నిలకడగా రాణిస్తూ, నాలుగో స్థానానికి సరైన ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకోవడం జరిగిపోయాయి...
‘ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీమ్‌లో ప్లేస్ ఉండాలంటే ప్రతీ వీక్‌నెస్‌ని అధిగమించాల్సిందే. ఇప్పుడు మిగిలిన వారి కంటే శ్రేయాస్ అయ్యర్‌కి తన స్థానాన్ని కాపాడుకోవడం చాలా అవసరం...
Image credit: PTI
ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఎలా ఆడగలడో అందరికీ తెలుసు. అతను టీమిండియాలోకి వచ్చిన తర్వాత చాలా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాబట్టి ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌కి ఏ మాత్రం గ్యారెంటీ లేదు...
Image credit: PTI
అయ్యర్ తనకి ఉన్న షార్ట్ బాల్ వీక్‌నెస్‌ని అధిగమించలేకపోతే టీమ్‌లో చోటు కోల్పోవాల్సి ఉంటుంది. బౌలర్లకు ఓవర్‌కి రెండు బౌన్సర్లు వేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయ్యర్ ఆ రెండు బాల్స్‌ని ఎలా వదిలేయాలో తెలుసుకుంటే చాలు..
క్రీజులో కుదురుకున్న తర్వాత షార్ట్ బాల్స్ ఆడలేకపోతే అది చాలా పెద్ద సమస్యే అవుతుంది. శ్రేయాస్ అయ్యర్‌లో చాలా టాలెంట్ ఉంది. దాన్ని కాదనలేం! అయితే టీమ్‌లో ప్లేస్ కాపాడుకోవాలంటే అతను ఈ వీక్‌నెస్‌ని అధిగమించి తీరాల్సిందే...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్...