- Home
- Sports
- Cricket
- దవడ పగిలింది, అయినా బౌలింగ్ చేస్తున్నా అని చెప్తే మా ఆవిడ జోక్ అనుకుంది... అనిల్ కుంబ్లే కామెంట్స్..
దవడ పగిలింది, అయినా బౌలింగ్ చేస్తున్నా అని చెప్తే మా ఆవిడ జోక్ అనుకుంది... అనిల్ కుంబ్లే కామెంట్స్..
టీమిండియా, 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడానికి ప్రధాన కారణం డెడికేషన్ లేకపోవడమే అంటారు చాలామంది. ఐపీఎల్ వచ్చాక టీమిండియాకి ఆడడాన్ని పెద్ద అఛీవ్‌మెంట్‌లా భావించడం లేదు క్రికెటర్లు. చిన్న గాయానికి నెలలకు నెలలు టీమ్‌కి దూరం అవుతున్నారు..

Jasprit Bumrah
అప్పుడెప్పుడో ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయంతో టీమ్‌కి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, ఎంత వరకూ కోలుకున్నాడు? ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడు? అనే విషయాలపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి కూడా అంతే...
Nathan Lyon
మోకాలికి గాయమైనా నాథన్ లియాన్ బ్యాటింగ్‌కి రావడం, కంటికి దెబ్బ తగిలినా ప్యాట్ కమ్మిన్స్ ఆటను కొనసాగించడం చూసి భారత క్రికెట్ ఫ్యాన్స్, మనోళ్లలో ఎందుకు ఇంత డెడికేషన్ ఉండదని తెగ ఫీలయ్యారు. అయితే 21 ఏళ్ల క్రితం దవడ విరిగినా, కట్టుతో బౌలింగ్ చేసిన అనిల్ కుంబ్లే అంకితభావిం, ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది...
2022 వెస్టిండీస్ పర్యటనలో మెర్విన్ దిల్లాంగ్ వేసిన బౌన్సర్, అనిల్ కుంబ్లే హెల్మెట్‌కి బలంగా తగలింది. స్కానింగ్స్‌లో అనిల్ కుంబ్లే దవడ పగిలిందని తేలడంతో, సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. అయితే సర్జరీ కోసం ఇండియాకి వెళ్లడం కంటే నొప్పిని భరిస్తూ బౌలింగ్ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు అనిల్ కుంబ్లే...
తల చుట్టూ కట్టు కట్టుకుని, 14 ఓవర్లు బౌలింగ్ చేసిన అనిల్ కుంబ్లే, అత్యంత కీలకమైన విండీస్ స్టార్ బ్యాటర్ బ్రియాన్ లారా వికెట్ తీశాడు. అయితే విండీస్ ఇన్నింగ్స్‌లో కార్ల్ హూపర్, శివ్‌నరైన్ చంద్రపాల్, రిడ్లే జాకబ్స్ సెంచరీలు చేయడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
‘భారత ఇన్నింగ్స్ తర్వాత నేను, నా భార్య ఛేతనకి ఫోన్ చేసి విషయం చెప్పాను. నేను ఇంటికి రావాలనుకుంటా, నా దవడ పగిలింది, సర్జరీ చేయాలంటున్నారని చెప్పా. ఆమె నా కోసం బెంగళూరులో అన్ని ఏర్పాట్లు చేసింది..
ఆమె ఫోన్ పెట్టేసేముందు, నేను బౌలింగ్ చేయాలనుకుంటానని చెప్పా.ఆమె అస్సలు నమ్మలేదు, జోక్ చేస్తున్నానని అనుకుంది. అప్పుడు ప్లేయింగ్ ఎలెవన్‌లో నేను ఒక్కడినే స్పిన్నర్‌ని. అంతకుముందు రెండు టెస్టుల్లో కూడా నేను ఆడలేదు..
Anil Kumble
ఆ మ్యాచ్‌లో మేం దాదాపు 600 పరుగులు చేశాం, విదేశాల్లో అంత స్కోరు చేయడం చాలా అరుదు. అందుకే గెలవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదని అనిపించింది. కనీసం రెండు వికెట్లు తీసినా చాలనుకున్నా..
బౌలింగ్ చేయడానికి ముందు డాక్టర్, నా రెండు దవడలను ఒక్కదగ్గర పెట్టి, కట్టుకట్టాడు. ఏం తినడానికి లేదు. కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అది కూడా చాలా కష్టంగా ఉండేది. అందులోనూ వెస్టిండీస్‌లో వెజిటేరియన్ ఫుడ్ దొరకడమే చాలా కష్టం...’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ కుంబ్లే..