- Home
- Sports
- Cricket
- ఐపిఎల్ లో సెంచరీ వికెట్స్ రికార్డు.. ముంబై ఇండియన్స్ లోకి తోపు ఆల్ రౌండర్, ఎవరో తెలుసా?
ఐపిఎల్ లో సెంచరీ వికెట్స్ రికార్డు.. ముంబై ఇండియన్స్ లోకి తోపు ఆల్ రౌండర్, ఎవరో తెలుసా?
IPL 2026 : ముంబై ఇండియన్స్ టీంలో ఇప్పటికే హార్దిక్ పాండ్యా వంటి సూపర్ ఆల్ రౌండర్ ఉన్నాడు. ఇప్పుడు ఐపిఎల్ లో సెంచరీ వికెట్ల రికార్డు కలిగిన మరో తోపు ఆల్ రౌండర్ ఆ జట్టులో చేరనున్నాడట. అతడు ఎవరో తెలుసా?

ముంబై ఇండియన్స్ టీంలోకి మరో ఆల్ రౌండర్
India Premier League : ఐపిఎల్ 2026 లో భారీ మార్పులు ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆటగాళ్ల వేలంపాటకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రిటెన్షన్ ప్రక్రియతో పాటు ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడికి సంబంధించి ట్రేడింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్ (MI) మరో ఆల్ రౌండర్ పై కన్నేసినట్లు తెలుస్తోంది... ట్రేడింగ్ ద్వారా అతడిని జట్టులోకి తీసుకుంటోందని క్రీడావర్గాల టాక్. ఇప్పటికే డీల్ కూడా పూర్తయినట్లు సమాచారం.
ఆ ఆటగాడెవరు?
భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో ముంబై ఇండియన్స్ లో ఆడనున్నాడట... ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) లో కొనసాగుతున్నాడు... అయితే ఆల్-క్యాష్ ట్రేడ్ డీల్ ద్వారా అతడిని ఎంఐ కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందట. ఈ మేరకు ఎల్ఎస్జితో సంప్రదింపులు జరపగా ఆ ఫ్రాంచైజీ సూత్రప్రాయంగా అంగీకరించింది... దీంతో శార్దూల్ ఎంఐ జట్టులో చేరడం ఖాయమైనట్లు సమాచారం.
ఏమిటీ ఆల్ క్యాష్ ట్రేడ్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటేనే కాసుల గేమ్. డబ్బులుంటే చాలు ఏమైనా చేయవచ్చు... అందుకు తగ్గట్లుగానే నిబంధనలు ఉన్నాయి. ఇలాంటి నిబంధనే ఆల్ క్యాష్ ట్రేడ్... ఓ జట్టులో కొనసాగుతున్న ఆటగాడిని మరో జట్టు కొనుగోలు చేయడమే ఈ విధానం. ఇరు ఫ్రాంచైజీ అంగీకారంతో ఈ ప్రక్రియ జరుగుతుంది.
కొత్త జట్టు ఎక్కువ పారితోషికం ఆఫర్ చేస్తే ఆ అదనపు మొత్తం ఆటగాడు, పాత జట్టు మధ్య సమానంగా పంచుతారు. ఒకవేళ జీతం తగ్గితే ఆటగాడు దానిని లిఖిత పూర్వకంగా అంగీకరించాలి... బీసీసీఐ అనుమతి తీసుకోవాలి. అయితే ప్రస్తుతం శార్దూల్ ఠాకూర్ ను ఎల్ఎస్జీలో కొనసాగుతున్న ధరకే ఎంఐ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2025 వేలంపాటలో అమ్ముడిపోని శార్దూల్... ఐపిఎల్ ఎలా ఆడాడు?
2025 మెగా వేలంలో అమ్ముడుపోని ఠాకూర్ ను మోహ్సిన్ ఖాన్ స్థానంలో LSG జట్టులోకి తీసుకుంది... ఇందుకోసం అతన్ని రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ ను ఆఫర్ చేసింది. ఇప్పుడే ఇదే రూ.2 కోట్లకు ముంబై ఇండియన్స్ అతడిని ఆల్ క్యాష్ ట్రేడ్ ద్వారా జట్టులో చేర్చుకోబోతోందని సమాచారం.
ఐపీఎల్ 2025లో శార్దూల్ లక్నో జట్టు తరపున ఆడాడు... మొదటి రెండు మ్యాచుల్లో అద్భుతంగా ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే తర్వాత ఠాకూర్ ఇబ్బంది పడ్డాడు... పది మ్యాచ్‌లు ఆడిన అతడు 11.02 ఎకానమీ రేటుతో 13 వికెట్లు మాత్రమే తీశాడు.
ఐపీఎల్ వేలం ఎప్పుడు, ఎక్కడ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్ వేలం అబుదాబిలో జరగనుంది. దీనికి సంబంధించిన డీల్, వేదికను ఖరారు చేసే పనిలో పాలక మండలి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వేలం తేదీలు డిసెంబర్ 15-16గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్నీ సజావుగా జరిగితే ఈ తేదీల్లోనే వేలంపాట ఉంటుంది... లేదంటే తేదీ మారే అవకాశాలున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్ రీక్యాప్
2025 ఐపీఎల్ సీజన్ ఒక చారిత్రాత్మక సీజన్‌గా నిలిచింది. 18వ నంబర్ జెర్సీ ఆటగాడు విరాట్ కోహ్లీ, 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తరపున ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ (PBKS)ను ఆరు పరుగుల తేడాతో ఓడించి చిరకాల కలను నిజం చేసుకుంది ఆర్సిబి.
ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ (GT) ఓపెనర్ సాయి సుదర్శన్ 15 మ్యాచ్‌లలో 54.21 సగటుతో 759 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 156.17. GT ఫైనల్‌కు చేరుకోలేకపోయినా బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్‌లో కూడా ఆధిపత్యం చెలాయించింది. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 15 మ్యాచ్‌లలో 19.52 సగటుతో 25 వికెట్లు తీసి, 4/41 ఉత్తమ గణాంకాలతో అగ్రస్థానంలో నిలిచాడు.