అమెరికాలో క్రికెట్ ఫ్రాంఛైజీ కొంటున్న షారుక్ ఖాన్... అక్కడ కూడా నైట్‌రైడర్స్‌యే....
First Published Dec 1, 2020, 5:46 PM IST
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ పేరుతో ఫ్రాంఛైజీని కలిగి ఉన్న షారుక్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ‘ట్రినిడాడ్ అండ్ టొబాగో’ జట్టును కలిగి ఉన్నాడు. తాజాగా మరో కొత్త ఫ్రాంఛైజీ కొనుగోలు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు షారుక్.

అమెరికాలో క్రికెట్‌కి పెద్దగా ఆదరణ లేదు. అయితే రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్ ‘క్రికెట్ ఆల్ స్టార్స్’ పేరుతో యునైటెడ్ స్టేట్స్‌లో ఓ మెగా క్రికెట్ లీగ్ చేపట్టాడు.

ఈ లీగ్ ద్వారా బేస్‌బాల్, ఫుట్‌బాల్ వంటి క్రీడలను అమితంగా ఇష్టపడే అమెరికన్లకి క్రికెట్‌ని పరిచయం చేయాలని సచిన్ చేసిన ప్రయత్నం చాలావరకూ విజయవంతమైంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?