- Home
- Sports
- Cricket
- INDvsENG: హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, అశ్విన్... రికార్డుల వేట...
INDvsENG: హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, అశ్విన్... రికార్డుల వేట...
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పూర్తిగా పట్టు సాధించే దిశగా సాగుతోంది. 106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియాను భారత సారథి విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ కలిసి ఆదుకున్నారు. బ్యాటింగ్‌కి ఏ మాత్రం సహకరించని పిచ్‌పై భారత సారథి విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో రవిచంద్రన్ అశ్విన్, కోహ్లీ కంటే వేగంగా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ 107 బంతుల్లో 7 ఫోర్లతో టెస్టుల్లో 25వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా ఇది 90వ హాఫ్ సెంచరీ కాగా ఇంగ్లాండ్‌పై 12వది.

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ బాదాడు. రెండో టెస్టులో హాఫ్ సెంచరీ అతనికి వరుసగా మూడో అర్ధశతకం...

మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్... టెస్టుల్లో 12వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2017 తర్వాత నాలుగేళ్లకి టెస్టుల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ బాదాడు రవిచంద్రన్ అశ్విన్...

8వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా కపిల్‌దేవ్ తర్వాతి స్థానంలో నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. కపిల్‌దేవ్ ఈ స్థానంలో 1777 పరుగులు చేయగా, రవిచంద్రన్ అశ్విన్ 1400పైగా పరుగులు చేశాడు. 1265 పరుగులు చేసిన అనిల్ కుంబ్లేని అధిగమించాడు రవిచంద్రన్ అశ్విన్.

ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, 50+ పరుగులు చేయడం రవిచంద్రన్ అశ్విన్‌కి ఇది ఆరోసారి. ఇయాన్ బోథమ్ 11, షకీబ్ అల్ హసన్ 9సార్లు మాత్రమే అశ్విన్ కంటే ముందున్నారు...

62 ఓవర్లలకు 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసిన టీమిండియా, ఇంగ్లాండ్ కంటే 391 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. అశ్విన్, కోహ్లీ కలిసి ఏడో వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.