అదరగొట్టిన శుభమన్ గిల్... ట్విట్టర్ ట్రెండింగ్స్ లో సారా టెండుల్కర్..!
ఇంత స్కోర్ చేసి గిల్ నిజానికి ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వాలి.. కానీ.. గిల్ పరుగుల మహత్యం.. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ ట్రెండింగ్ లోకి రావడం గమనార్హం.

శుభమన్ గిల్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదనుకుంట. టీమిండియా యువ క్రికెటర్ ఈ శుభమన్ గిల్. అయితే.. అందరిలా కాకుండా.. స్టేడియంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ తన మార్క్ చూపిస్తూ ఉంటాడు.
శుక్రవారం కూడా గిల్ అదేవిధంగా అదరగొట్టాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత జట్టులోకి వచ్చిన గిల్.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. శిఖర్ ధావన్ తో కలిసి 119 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించాడు. ఈమ్యాచ్ లో గిల్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టి 64 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ తర్వాత.. గిల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అదరగొట్టాడని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే.. ఇంత స్కోర్ చేసి గిల్ నిజానికి ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వాలి.. కానీ.. గిల్ పరుగుల మహత్యం.. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ ట్రెండింగ్ లోకి రావడం గమనార్హం.
ఇలా గిల్ టాపిక్ వచ్చినప్పుడు సారా టెండుల్కర్ కూడా ట్రెండ్ అవ్వడం ఇదేమీ తొలిసారి కాదు. గిల్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ.. సారా టాపిక్ కూడా వస్తూనే ఉంటుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.
వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు ఫాలో అవ్వడం.. ఎప్పుడో ఒకసారి ఫోటోకి కామెంట్ పెట్టడంతో.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.
ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు అటూ సారా కానీ.. ఇటూ గిల్ కానీ ఎప్పుడూ స్పందించింది లేదు. కానీ.. వీరు త్వరలో పెళ్లితో ఒక్కటి కానున్నారంటూ వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలో తాజాగా... గిల్ హాఫ్ సెంచరీతో సారా మరోసారి ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. ప్రతి ఒక్క నెటిజన్ గిల్ ని ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే.. మరో వైపు సారాని ట్యాగ్ చేయడం లేదంటే.. సారా చాలా ఆనందంగా ఉండి ఉంటుంది, ఈ సమయంలో సారా అంత హ్యాపీ పర్సన్ ఇంకొకరు ఉండరంటూ... సారా గిల్ ని చూసి గర్వపడుతుంది అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. మరి ఈసారైనా సారా కానీ... సచిన్ గానీ లేదంటే గిల్ గానీ స్పందిస్తారేమో చూడాలి.