- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మతో ఓపెనర్‌గా సంజూ శాంసన్! వెస్టిండీస్ టూర్‌లో ఏదైనా జరగొచ్చంటున్న బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్...
రోహిత్ శర్మతో ఓపెనర్‌గా సంజూ శాంసన్! వెస్టిండీస్ టూర్‌లో ఏదైనా జరగొచ్చంటున్న బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్...
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంకా మూడు నెలల సమయం కూడా లేదు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతున్న భారత జట్టు, ఆ తర్వాత 3 మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది. 2022 నుంచి వన్డేల్లో శుబ్‌మన్ గిల్‌ని ఓపెనర్‌గా కొనసాగిస్తూ వస్తోంది టీమిండియా...

రెండేళ్లుగా వన్డేల్లో నిలకడైన ప్రదర్శన చూపించిన శుబ్‌మన్ గిల్, 24 వన్డేల్లో 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 65.55 యావరేజ్‌తో 1311 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.
Image credit: PTI
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న శుబ్‌మన్ గిల్, టాప్ 5లో ఉన్న ఏకైక భారత బ్యాటర్‌గా నిలిచాడు.. విరాట్ కోహ్లీ 8, రోహిత్ శర్మ 10వ స్థానంలో కొనసాగుతున్నారు.
Sanju Samson
అయితే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ కాకుండా రోహిత్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నాడు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్..
Image credit: PTI
‘సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్‌లో ఉన్నాడు. అయితే అతను సంజూ శాంసన్‌కి పోటీ కాలేడు. సంజూ టాపార్డర్ బ్యాటర్. సూర్య మిడిల్ ఆర్డర్ బ్యాటర్. వన్డేల్లో సూర్య గణాంకాలు ఏ మాత్రం బాగోలేవు. అయితే శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో అతనికి మరో ఛాన్స్ దక్కింది..
Sanju Samson
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో మూడు సార్లు డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, ఈ వన్డే సిరీస్‌లో రాణిస్తే, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సంజూకి ఇషాన్ కిషన్‌తో పోటీ ఉంటుంది...
Sanju Samson
శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఇలా ఒకటికి నలుగురు ఓపెనర్లను వన్డే సిరీస్‌కి ఎంపిక చేశారు. నా ఉద్దేశంలో వీరందరి కంటే రోహిత్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది.
Image credit: PTI
రోహిత్ శర్మ కొన్నాళ్లుగా ఫామ్‌లో లేక, నిలకడగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. సంజూ శాంసన్ మొదటి బంతి నుంచే బౌండరీలు బాదాలని అనుకుంటాడు.
Image credit: PTI
కాబట్టి ఓ ఎండ్‌లో శాంసన్, బౌండరీలు బాదుతుంటే మరో ఎండ్‌లో రోహిత్ శర్మ ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ కొనసాగించొచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్..