కేరళ కెప్టెన్‌గా సంజూ శాంసన్... మహారాష్ట్రకు రాహుల్ త్రిపాఠి, గుజరాత్‌కి అక్షర్ పటేల్...
First Published Dec 31, 2020, 9:36 AM IST
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ 2021లో కేరళ జట్టుకి సంజూ శాంసన్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు. 20 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది కేరళ క్రికెట్ అసోసియేషన్. 2011లో సంజూ శాంసన్‌కి క్యాప్ ఇచ్చి, ఆహ్వానించిన శ్రీశాంత్, ఈ ఏడాది అతని సారథ్యంలోనే టోర్నీ ఆడబోతున్నాడు. కేరళ జట్టులో శ్రీశాంత్‌తో పాటు రాబిన్ ఊతప్ప, బాసిల్ తంపి వంటి క్రికెటర్లు ఆడబోతున్నారు. జనవరి 1న కేరళ జట్టు, కొచ్చి నుంచి ముంబై బయలుదేరి వెళ్లనుంది.

కేరళ జట్టు: సంజూ విశ్వనాథ్ శాంసన్, జలజ్ సక్సేనా, సచిన్ బేబీ (వైస్ కెప్టెన్), విష్ణు వినోద్, బాసిల్ తంపి, నిధీష్, అక్షయ్ చంద్రన్, అభిషేక్ మోహన్, మహ్మద్ అజారుద్దీన్, మిథున్, రోజిత్, రాబిన్ ఊతప్ప, సల్మాన్ నిజర్, శ్రీశాంత్, అసిఫ్, మిథన్ పి, వినూప్, రోహన్, వత్సల్ గోవింద్ శర్మ, శ్రీరూప్.

మహారాష్ట్ర జట్టుకి రాహుల్ త్రిపాఠి కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్ వంటి ప్లేయర్లకు మహారాష్ట్ర జట్టులో స్థానం దక్కింది...
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?