ఇక్కడ సాహా... అక్కడైతే పంత్... టీమిండియాకి ఇదే బెస్ట్ ఆప్షన్... ఎమ్మెస్కే ప్రసాద్...

First Published Dec 24, 2020, 6:40 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి  వికెట్ కీపర్ ప్లేస్ కోసం పోటీపడుతున్నారు వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్. పొట్టి ఫార్మాట్‌లో వికెట్ కీపర్ రేసులో రిషబ్ పంత్‌తో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటివాళ్లు పోటీపడుతున్నా, టెస్టుల్లో మాత్రం వృద్ధిమాన్ సాహా ఒక్కడే అతనికి గట్టి పోటీదారుగా నిలిచాడు. టెస్టుల్లో మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ, వన్డే, టీ20 ఫార్మాట్‌లో ఫెయిల్ అవుతుండడంతో మొదటి టెస్టులో పంత్‌కి తుదిజట్టులో చోటు దక్కలేదు.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్‌కి కాకుండా వృద్ధిమాన్ సాహాకు తుది జట్టులో చోటు దక్కడంపై విమర్శకులు పెదవి విరిచారు కూడా...

ట్రోలింగ్‌కి తగ్గట్టుగానే మొదటి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు వృద్ధిమాన్ సాహా. రెండు టెస్టుల్లోనూ ఘోరంగా ఫెయిల్ అయ్యి, టీమిండియా ఓటమికి ఓ కారణంగా నిలిచాడు.

వికెట్ కీపింగ్‌లో కళ్లు చెదిరే క్యాచులు అందుకోవడం వృద్ధిమాన్ సాహాకి ప్లస్ పాయింట్... ఐపీఎల్‌లో సాహాను ఉద్దేశించి... ‘వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్’ అంటూ సంబోధించాడు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి.

అప్పట్లో ధోనీ ఉండగా సాహాను బెస్ట్ వికెట్ కీపర్ అని ఎలా అంటారని పెద్ద రాద్ధాంతం చేశారు మాహీ ఫ్యాన్స్... ఆ విషయం పక్కనబెడితే, రిషబ్ పంత్ - వృద్ధిమాన్ సాహా మధ్య నెలకొన్న పోటీని ఓ చిన్న మార్పుతో భారత జట్టుకు ప్లస్ చేసుకోవచ్చని అంటున్నాడు మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.

‘భారత్‌లో టెస్టులు ఆడుతున్నప్పుడు వృద్ధిమాన్ సాహాను వికెట్ కీపర్‌గా ఎంచుకోవాలి. ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్ల బౌలింగ్‌లో వచ్చే ఎడ్జ్ క్యాచులు అందుకోవాలంటే వికెట్ కీపింగ్‌లో అద్భుతాలు చేయాలి...

వికెట్ల వెనకాల అలాంటి టాలెంట్ వృద్ధిమాన్ సాహాకి ఉంది... అయితే విదేశాల్లో ఆడేటప్పుడు సాహాకి ఇలాంటి అవకాశాలు పెద్దగా రావు. ఎందుకంటే విదేశీ పిచ్‌లు మన స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించవు.

కాబట్టి బ్యాటింగ్‌లో రాణించే రిషబ్ పంత్‌ను విదేశీ టూర్లకు వికెట్ కీపర్‌గా ఎంచుకుంటే బెటర్. రిషబ్ పంత్ ఫిట్‌నెస్ సరిగ్గా ఉండదు. గాల్లోకి ఎగురుతూ క్యాచులు పట్టుకోవడం పంత్ వల్ల అయ్యే పని కాదు...

అయితే రిషబ్ పంత్ కష్టపడితే కీపింగ్‌లో కూడా మెరుగవ్వగలడు. అంతకుమించి అతను బ్యాటింగ్‌లో రాణిస్తున్నాడు. ప్రాక్టీస్ మ్యాచులో ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు బాది సెంచరీ పూర్తిచేసుకున్నాడు...’ అని చెప్పుకొచ్చాడు ఎమ్మెస్కే ప్రసాద్.

వృద్ధిమాన్ సాహా మంచి వికెట్ కీపర్ అయినా విదేశీ పిచ్‌లపై అతను బ్యాటింగ్ చేయడంలో ఇబ్బందిపడుతున్నాడని చెప్పిన ఎమ్మెస్కే ప్రసాద్... ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో సెంచరీలు బాదిన పంత్‌కి అక్కడ అవకాశం ఇవ్వాలని సూచించాడు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?