సచిన్ సార్, సచిన్ అంతే! పేద పిల్లల కోసం స్కూల్ నిర్మించిన టెండూల్కర్ ఫౌండేషన్...
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని పదేళ్లు దాటినా,ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 50వ ఏట అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్, మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాండల్‌పూర్‌లో పేద పిల్లల కోసం ఓ స్కూల్‌ని నిర్మించింది సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ (STF). దేవాస్ జిల్లా ఖటేగాన్ తెహ్సిల్ మండలంలోని ఓ మారుమూల గ్రామమైన సాండల్‌పూర్‌లో అక్షరాస్యత శాతం 56.6 మాత్రమే...
Sachin at 50
సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ నిర్మించిన ఈ స్కూల్‌లో సాండల్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి 2300 మంది పిల్లలకు మెరగైన విద్య అందించబోతున్నారు..
Image credit: PTI
వీరందరికీ కేజీ నుంచి స్కూల్ విద్య పూర్తి అయ్యేవరకూ పూర్తి ఉచితంగా అన్ని వసతులతో విద్యను అందించబోతున్నారు...
Image credit: PTI
ఈ స్కూల్‌ని సచిన్ తన తల్లిదండ్రులు రజనీ, రమేశ్ టెండూల్కర్‌లకి అంకితం ఇచ్చారు సచిన్ టెండూల్కర్. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సచిన్ టెండూల్కర్, రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ సిరీస్‌లో కూడా ఆడుతున్నాడు..
పేద పిల్లలకి మెరుగైన విద్య, ఆరోగ్యం అందించేందుకు కృషి చేస్తున్న సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్, మున్సిపల్ ఆసుపత్రులతో కలిసి చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తోంది.