- Home
- Sports
- Cricket
- కప్పు గెలవకున్నా ఫ్యాన్స్ నమ్మకం పోలే.. మోస్ట్ పాపులర్ టీమ్స్‌లో ఆర్సీబీకి రెండో ప్లేస్..
కప్పు గెలవకున్నా ఫ్యాన్స్ నమ్మకం పోలే.. మోస్ట్ పాపులర్ టీమ్స్‌లో ఆర్సీబీకి రెండో ప్లేస్..
Most Popular Team: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లుగా ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ నానా రచ్చ చేసి తర్వాత ఉత్తచేతులతోనే సీజన్ ను ముగించడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వెన్నతో పెట్టిన విద్య.

ఐపీఎల్‌లో అన్నీ వనరులూ ఉండి కూడా కప్ గెలవని ఏకైక టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్లు, భీకర బౌలర్లు, తోపు స్పిన్నర్లు ఉన్నా.. ఆ జట్టు ఇంతవరకూ ఒక్క సీజన్ లో కూడా కప్ కొట్టలేదు. ఈసారైనా ఐపీఎల్ ట్రోఫీ కలను నిజం చేస్తారేమో అనుకుంటే ప్లేఆఫ్స్ కు చేరే క్రమంలో విజయం ముందు బోల్తా కొట్టింది ఆర్సీబీ.
అయితే ఇంతవరకూ కప్ గెలవకున్నా.. ఫ్యాన్స్ ప్రతీ ఏడాది నిరాశపడుతూనే ఉన్నా.. ఫాలోయింగ్ లో మాత్రం ఆర్సీబీకి తిరుగులేదు. ఐపీఎల్ లోనే కాదు ఏకంగా ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ టీమ్స్ లో ఆర్సీబీ.. రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
తాజాగా వెలువరించిన ఒక నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే సోషల్ మీడియాలో అత్యధిక పాలవోర్లు, సోషల్ మీడియా మేనేజ్మెంట్ (లైకులు, షేర్లు చేయడం, పోస్టులు, కామెంట్స్ వంటివి దీనికిందకు వస్తాయి) లో ఆర్సీబీ రెండో స్థానంలో నిలిచింది. భారత్‌లో అయితే బెంగళూరు టీమ్ నెంబర్ వన్ గా ఉంది.
ఏప్రిల్ 2023 వరకూ సోషల్ మీడియా మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ను లెక్కగట్టగా రియల్ మాడ్రిడ్‌కు 333 మిలియన్స్ ఇంటరాక్షన్స్ తో నెంబర్ వన్ టీమ్ గా ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 303 మిలియన్ ఇంటరాక్షన్స్ తో రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్ లో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నా ఇండియా, ఆసియా లో మాత్రం ఆర్సీబీదే నెంబర్ వన్ స్థానం.
ఆర్సీబీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానంలో నిలిచింది. సీఎస్కే 301 మిలియన్ ఇంటరాక్షన్స్ తో ఉంది. ఈ రెండు టీమ్స్ కు మధ్య అంతరాయం 2 మిలియన్స్ మాత్రమే కావడం గమనార్హం. బార్సిలోనా, మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్, అర్సెనల్ , లివర్ పూల్ వంటి ఫుట్ బాల్ టీమ్స్ ను కూడా వెనక్కినెట్టి ఆర్సీబీ, సీఎస్కేలు ముందుకు దూసుకెళ్లడం గమనార్హం.
Image credit: PTI
ఆర్సీబీ తో పాటు ఇన్‌స్టాగ్రామ్ లో నెంబర్ త్రీ పొజిషన్ లో ఉన్నాడు ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. భారత్ లో ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్‌గా ఉన్న కోహ్లీ.. ఇప్పుడు తన రేంజ్‌ను ఇండియా దాటి ఆసియా ఖండాన్ని కూడా విస్తరించాడు. ఇన్‌స్టాలో మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న అథ్లెట్లలో కోహ్లీ.. ఏకంగా 250 మిలియన్స్ ఫాలోవర్స్ తో మరెవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
క్రీడల్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రిస్టియానో రొనాల్డో కు ఇన్‌స్టాలో 585 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా రెండో స్థానంలో అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ 462 మిలియన్స్ ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి తర్వాత మూడో స్థానాన్ని కోహ్లీ దక్కించుకోవడం గమనార్హం.