ఎమ్మెస్ ధోనీ వల్లే రోహిత్ శర్మ ఇంత సక్సెస్ అయ్యాడు... గౌతమ్ గంభీర్ కామెంట్...
స్పిన్ ఆల్‌రౌండర్‌గా టీమ్‌లోకి వచ్చి, ఓపెనర్‌గా రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు రోహిత్ శర్మ. వన్డేల్లో 2 వేల పరుగులు అందుకునేందుకు 82 ఇన్నింగ్స్‌లు తీసుకున్న రోహిత్... ఆ తర్వాత 160 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు చేశాడు. అంటే రెట్టింపు వేగంతో పరుగులు చేశాడు రోహిత్..
rohit dhoni
అత్యంత నెమ్మదిగా వన్డేల్లో 2 వేల పరుగులు అందుకున్న మూడో ప్లేయర్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు రోహిత్ శర్మ. అయితే ఆ తర్వాత ఓపెనర్‌గా మారిన రోహిత్, 159 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు చేసి.. అత్యంత వేగంగా 10 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు..
rohit dhoni batting
విరాట్ కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో 10 వేల పరుగులు అందుకుంటే, రోహిత్ శర్మ 241 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయి చేరుకున్నాడు. 250 కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో 10 వేల పరుగులు చేసిన ప్లేయర్లు ఈ ఇద్దరు మాత్రమే..
మొదటి 100 ఇన్నింగ్స్‌ల్లో 2752 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఆ తర్వాత 141 ఇన్నింగ్స్‌ల్లో 7248 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా అత్యంత వేగంగా 8 వేల పరుగులు చేసిన ప్లేయర్ రోహిత్ శర్మ. రోహిత్‌కి 160 ఇన్నింగ్స్‌లు అవసరమైతే, హషీమ్ ఆమ్లా 173 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు..
రోహిత్ శర్మ ఈ సక్సెస్‌కి మహేంద్ర సింగ్ ధోనీకి క్రెడిట్ దక్కాలని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కామెంట్ చేశాడు..
Rohit-Dhoni
‘రోహిత్ శర్మ ఈరోజు చూస్తున్న సక్సెస్‌కి ఎమ్మెస్ ధోనీయే కారణం. ఎందుకంటే ఎన్ని మ్యాచుల్లో విఫలమైనా రోహిత్ మీద నమ్మకం ఉంచి, అతనికి చాలా అవకాశాలు ఇచ్చాడు...
rohit dhoni dhawan
కెరీర్ ఆరంభంలో అండగా నిలిచే కెప్టెన్ ఉంటే, ఆ ప్లేయర్ ఎంత సక్సెస్ అవుతాడో రోహిత్ శర్మను చూస్తే తెలుస్తుంది..’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్..
rohit dhoni
గౌతమ్ గంభీర్, మహేంద్ర సింగ్ ధోనీకి పాజిటివ్‌గా మాట్లాడడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ధోనీ పరువు తీయాలని, అతన్ని క్రెడిట్ స్టీలర్‌గా చిత్రీకరించే గౌతీ.. ఇలా పాజిటివ్‌గా మాట్లాడడం చాలా అరుదు..