- Home
- Sports
- Cricket
- Team India Next Test Captain: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ ఎవరు?
Team India Next Test Captain: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ ఎవరు?
Team India Next Test Captain: టెస్ట్ క్రికెట్ కు సీనియర్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. త్వరలోనే భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. మరీ భారత జట్టును నడిపించేది ఎవరు? టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ రేసులో ఉన్నది ఎవరు?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rohit Sharma Retires Who Will Be Indias Next Test Captain: రోహిత్ శర్మ బుధవారం టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇప్పుడు భారత రెడ్-బాల్ జట్టు పగ్గాలు ఎవరు చేపడతారనే చర్చ మొదలైంది. త్వరలోనే భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. కీలకమైన ఐదు టెస్టుల సిరీస్‌కు ముందే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఓపెనర్ తో పాటు కెప్టెన్ ఎవరు అనేదానిపై ఆసక్తి నెలకొంది.
"అందరికీ నమస్కారం, నేను టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నానని తెలియజేయాలనుకుంటున్నాను. తెల్లని దుస్తుల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. ఈ సంవత్సరాలలో మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. నేను ODI ఫార్మాట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం కొనసాగిస్తాను" అని రోహిత్ శర్మ తన టెస్ట్ క్యాప్ చిత్రంతో ఇన్‌స్టాగ్రామ్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు భారత టెస్టు జట్టుకు కెప్టెన్ రేసులో ఎవరున్నారో తెలుసుకుందాం.
1. జస్ప్రీత్ బుమ్రా
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్, టెస్ట్ జట్టులో ప్రస్తుత వైస్ కెప్టెన్ అయిన బుమ్రా ఇప్పటికే టెస్టుల్లో భారతదేశానికి నాయకత్వం వహించాడు. 2022 ఇంగ్లాండ్ పర్యటనలో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఐదవ టెస్టులో జట్టుకు నాయకత్వం వహించాడు. రోహిత్ శర్మ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోవడంతో ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో కూడా అతను జట్టుకు నాయకత్వం వహించాడు.
కపిల్ దేవ్ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో భారతదేశానికి నాయకత్వం వహించిన ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇప్పుడు పూర్తి సమయం పాత్రను పోషించడానికి ముందంజలో ఉన్నాడు. తన ప్రశాంత స్వభావం, అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టే బుమ్రాకు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా మంచి గౌరవాన్ని పొందుతాడు. అయితే, పనిభారం, గాయాల నిర్వహణ చుట్టూ ఉన్న ఆందోళనలు పూర్తి సమయం కెప్టెన్సీ అంటే బీసీసీఐని ఆలోచనలో పడేసే అవకాశముంది.
2. శుభ్‌మన్ గిల్
భారత జట్టుకు భవిష్యత్తు కెప్టెన్ గా కనిస్తున్న శుభ్ మన్ గిల్ దీర్ఘకాలిక విషయాలు పరిగణలోకి తీసుకుంటే కెప్టెన్సీ దక్కే అవకాశముంది. ఇంకా సీనియర్ స్థాయిలో భారతదేశానికి నాయకత్వం వహించనప్పటికీ, అతని పరిణతి, వ్యూహాత్మక అవగాహన ప్రశంసలను అందుకున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు గిల్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. భవిష్యత్ నాయకుడిగా ఎదుగుతున్నాడు. అయితే, అతని పరిమిత అనుభవం, టెస్టుల్లో అస్థిరమైన ప్రదర్శనలు ఉన్నప్పటికీ కెప్టెన్సీ రేసులో ఉంటాడు.
3. కేఎల్ రాహుల్
భారత జట్టు సీనియర్ స్టార్ ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్ కూడా భారత టెస్టు జట్టు కెప్టెప్ రేసులో ఉన్నాడు. రాహుల్ వివిధ ఫార్మాట్లలో జట్టుకు నాయకత్వం వహించాడు. నమ్మకమైన నాయకుడిగా కనిపిస్తాడు. గతంలో రెండు టెస్టుల్లో భారతదేశానికి నాయకత్వం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. రాహుల్ కూల్ నాయకత్వ శైలి, అన్ని ఫార్మాట్లలో అదరగొట్టే సామర్థ్యం అతన్ని బలమైన కెప్టెన్ అభ్యర్థిగా చేస్తాయి.
4. రిషబ్ పంత్
గాయం కారణంగా చాలా కాలం పాటు టీమ్ కు దూరమైన రిషబ్ పంత్.. అద్భుతంగా రీఎంట్రీ ఇచ్చాడు. అతని దూకుడు, చురుకుదనం కెప్టెన్సీ రేసులో ఉంచుతున్నాయి. వికెట్ కీపర్-బ్యాటర్ టెస్టుల్లో భారతదేశానికి మ్యాచ్ విన్నర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం IPLలో లక్నో సూపర్ జెయింట్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డులు, దేశవాళీ క్రికెట్ లో కెప్టెన్ గా అనుభవం ఉన్నప్పటికీ ఫిట్‌నెస్, గాయాలు క్రమంలో బీసీసీఐ పంత్ వైపు మొగ్గుచూపుతుందా లేదా అనేది చూడాలి.