- Home
- Sports
- Cricket
- వన్డే వరల్డ్ కప్ 2023 కోసం గడ్డం తీసేసిన రోహిత్ శర్మ.. గడ్డం ఉన్న ఏ కెప్టెన్ కూడా..
వన్డే వరల్డ్ కప్ 2023 కోసం గడ్డం తీసేసిన రోహిత్ శర్మ.. గడ్డం ఉన్న ఏ కెప్టెన్ కూడా..
సెంటిమెంట్లు పలు రకములు. సచిన్ టెండూల్కర్, బ్యాటింగ్‌కి వెళ్లేటప్పుడు ఎప్పుడూ కూడా లెఫ్ట్ లెడ్‌కి ప్యాడ్ ముందు కట్టుకునేవాడు. అలాగే అనిల్ కుంబ్లే, బౌలింగ్ వేసే ప్రతీసారీ సచిన్‌కి టవల్ ఇచ్చేవాడు. ఇలా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం ఓ కొత్త సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడు రోహిత్ శర్మ..

Rohit Sharma and Harbhajan Singh
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కి ముందు క్లీన్ షేవ్‌తో కనిపించాడు రోహిత్ శర్మ. వచ్చే వరల్డ్ కప్ వరకూ ఇదే లుక్ మెయింటైన్ చేయాలని రోహిత్ శర్మ ఫిక్స్ అయినట్టు అతని ఫ్యాన్స్ చెబుతున్నారు.. దీనికి ఓ బలమైన కారణమే ఉంది.
ఇప్పటిదాకా వన్డే వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్లలో ఏ కెప్టెన్‌కి కూడా గడ్డం లేదు. 1975, 1979 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో వెస్టిండీస్‌ని విశ్వవిజేతగా నిలిచిన క్లెయివ్ లార్డ్ దగ్గర్నుంచి 2019 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇయాన్ మోర్గాన్ వరకూ అందరూ క్లీన్ షేన్‌తో బరిలో దిగిన కెప్టెన్లే టైటిల్స్ గెలిచారు..
ms dhoni world cup
కపిల్ దేవ్, అలెన్ బోర్డర్, ఇమ్రాన్ ఖాన్, అర్జున రణతుంగ, స్టీవ్ వా, రికీ పాంటింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, మైకేల్ క్లార్క్... ఇలా వన్డే వరల్డ్ కప్ గెలిచిన వారంతా గడ్డం లేనివాళ్లే...
Rohit Sharma
2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ గడ్డంతో బరిలో దిగాడు.రిజల్ట్ తేడా కొట్టేసింది. కొన్నాళ్లుగా గుబురు గడ్డం, మీసాలతో కనిపిస్తున్న రోహిత్ శర్మ, వెస్టిండీస్‌తో సిరీస్‌కి ముందు క్లీన్ షేవ్ చేయడంతో ఈ బియర్డ్ సెంటిమెంట్ తెగ వైరల్ అవుతోంది..
Kane Williamson
2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడినప్పుడు కేన్ విలియంసన్ కూడా గడ్డంతో ఉండడం ఈ సెంటిమెంట్‌కి బలం చేకూరుస్తుందని అంటున్నారు అభిమానులు..
మరి ఈ గడ్డం సెంటిమెంట్, టీమిండియాకి ఎంత వరకూ కలిసి వస్తుంది? నిజంగా ఇండియాలో జరిగే వరల్డ్ కప్ 2023 ఫైనల్ వరకూ రోహిత్ శర్మ ఇదే లుక్‌ని కంటిన్యూ చేస్తాడా? అనేది తెలియాలంటే 3 నెలలు ఎదురుచూడక తప్పదు.