- Home
- Sports
- Cricket
- రెండేళ్లుగా డోపింగ్ టెస్టుకి హాజరుకాని విరాట్ కోహ్లీ... అత్యధిక సార్లు టెస్టు చేయించుకున్న రోహిత్ శర్మ...
రెండేళ్లుగా డోపింగ్ టెస్టుకి హాజరుకాని విరాట్ కోహ్లీ... అత్యధిక సార్లు టెస్టు చేయించుకున్న రోహిత్ శర్మ...
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గత రెండేళ్లుగా డోప్ టెస్టుకి హాజరు కాలేదని సంచలన విషయాన్ని బయటపెట్టింది వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA). 2021 నుంచి అథ్లెట్లకు నిర్వహించిన డోపింగ్ టెస్టుల వివరాలను వెల్లడించింది వాడా..

Rohit Sharma-Virat Kohli
భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) ఆగస్టు 2019 నుంచి క్రికెటర్లను కూడా డోపింగ్ టెస్టు పరిధిలోకి తీసుకొచ్చింది. నిషేధిక ఉత్ప్రేరకాలు వాడితే వారిపై చర్యలు తీసుకుంటారు. పృథ్వీ షా, రింకూ సింగ్ ఇలాగే డోపింగ్ టెస్టులో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలి కొన్నాళ్లు బ్యాన్ అనుభవించారు..
Rohit Sharma
తాజా సమాచార హక్కు చట్టం ద్వారా నాడా నుంచి సేకరించిన లెక్కల ప్రకారం 2021 -2022 మధ్య రెండేళ్లలో 5,961 మంది భారత క్రీడాకారులకి డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 114 మంది భారత క్రికెటర్లు. మిగిలిన క్రీడలతో పోలిస్తే 1717 మంది అథ్లెటిక్స్ ఈ డోప్ పరీక్షల్లో పాల్గొన్నారు.
Rohit Sharma
గడిచిన రెండేళ్లలో అత్యధిక సార్లు డోపింగ్ టెస్టు చేయించుకున్న క్రికెటర్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ. రెండేళ్లలో రోహిత్ శర్మ, ఆరు సార్లు డోపింగ్ పరీక్షల్లో పాల్గొన్నాడు. అయితే దీనికి కారణం ఉంది. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్, 2022 ఏడాదిలో ఆడిన మ్యాచుల కంటే ఆడని మ్యాచులే ఎక్కువ..
Rohit Sharma
గాయాలతో కొన్ని మ్యాచులకు దూరమైన రోహిత్ శర్మ, కరోనా బారిన పడడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో ఆడలేదు. గాయం నుంచి కోలుకోవడానికి మందులు వాడిన తర్వాత డోప్ టెస్టుకి శాంపిల్స్ ఇవ్వడం తప్పనిసరి కావడంతో అటు ఎన్‌సీఏకి, ఇటు నాడాకి రెగ్యూలర్ కస్టమర్ అయ్యాడు రోహిత్ శర్మ..
Suryakumar Yadav
ఈ రెండేళ్లలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా.. వంటి ఏడుగురు క్రికెటర్లు కేవలం ఒక్కసారి మాత్రమే డోప్ టెస్టు చేయించుకున్నారు. వీరు కూడా గాయంతో బాధపడిన తర్వాత ఈ శాంపిల్స్ ఇవ్వడం విశేషం..
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న 25 మంది క్రికెటర్లలో 12 మంది ఇప్పటిదాకా నాడాకి డోప్ శాంపిల్స్ ఇవ్వలేదు. వీరిలో విరాట్ కోహ్లీతో పాటు హార్ధిక్ పాండ్యా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, సంజూ శాంసన్, శ్రీకర్ భరత్, వాషింగ్టన్ సుందర్ వంటి ప్లేయర్లు ఉన్నారు..
ఇదే సమయంలో భారత మహిళా జట్టులోని ప్లేయర్లు అందరూ నాడాకి డోప్ శాంపిల్స్ అందించారు. అంతేకాకుండా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన.. అత్యధిక సార్లు శాంపిల్స్ ఇచ్చిన వారిలో ఉన్నారు.