- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్... ఆడేది తక్కువ, గాయాలతో...
రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్... ఆడేది తక్కువ, గాయాలతో...
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా టీమిండియాలో ఏ ప్లేయర్ ఫిట్‌నెస్ చూసినా అంతా గాయాల మయం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి ఒకరిద్దరు ప్లేయర్లు మినహా మెజారిటీ ప్లేయర్లు గాయాలతో బాధపడుతూ ఏడాదిలో సగం సిరీసులకు దూరమవుతున్నారు. ఇలా గాయాలతో సతమతమవుతున్నవారిలో సీనియర్లతో పాటు జూనియర్ యంగ్ క్రికెటర్లు కూడా ఉండడం విశేషం...

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా గడపబోతోంది టీమిండియా. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఓ జట్టు ఐర్లాండ్ టూర్‌కి వెళ్తుంటే, మరో జట్లు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది... అయితే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు గాయపడిన కెఎల్ రాహుల్... ఇంగ్లాండ్ టూర్‌కి కూడా వెళ్లడం లేదు...
టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో ఉన్న కెఎల్ రాహుల్, గత ఏడాది కాలంలో ఇలా గాయంతో జట్టుకి దూరం కావడం ఇదేమీ తొలిసారి కాదు. గత ఏడు నెలల్లో నాలుగు సార్లు గాయాల కారణంగా జట్టుకి దూరమయ్యాడు కెఎల్ రాహుల్...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి గాయాలతో బాధపడుతున్న రోహిత్ శర్మ... ఐపీఎల్ 2021 సీజన్‌లో గాయపడి, ఆస్ట్రేలియా టూర్‌లో ఆఖరి రెండు టెస్టు మ్యాచులు మాత్రమే ఆడగలిగాడు...
సౌతాఫ్రికా టూర్‌కి ముందు రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ అప్పగించి, అష్టకష్టాలు అనుభవించి, ఘోర పరాభవాలతో స్వదేశానికి తిరిగి వచ్చింది భారత జట్టు... రోహిత్ శర్మ ఎప్పుడు ఫిట్‌గా ఉంటాడో, ఎప్పుడు గాయపడి జట్టుకి దూరమవుతాడో చెప్పడం చాలా కష్టం...
రవీంద్ర జడేజా... టీమిండియాలో మూడు ఫార్మాట్లు ఆడుతున్న కీలక ప్లేయర్లలో ఒకడు. అయితే జడేజా గత రెండేళ్లుగా గాయాలతో సహజీవనం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో రెండు సార్లు గాయపడి జట్టుకి దూరమైన జడ్డూ, ఆ తర్వాత గాయంతో స్వదేశంలో సిరీస్‌లు ఆడలేకపోయాడు...
గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకి అందుబాటులో లేని రవీంద్ర జడేజా, రీఎంట్రీ తర్వాత ఐపీఎల్ 2022 సీజన్‌లో మరోసారి గాయపడ్డాడు. ఈ రెండేళ్లలో రవీంద్ర జడేజా ఆడిన మ్యాచుల కంటే గాయాలతో తప్పుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువగా ఉంది...
Suryakumar Yadav
లేటు వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి, కీలక భాగస్వామిగా మారిపోయాడు సూర్యకుమార్ యాదవ్. మూడు, నాలుగు స్థానాల్లో ప్రధాన బ్యాటర్‌గా మారిన సూర్యకుమార్ యాదవ్‌ని కూడా గాయాలు వెంటాడుతున్నాడు. లంకతో టీ20 సిరీస్‌కి ముందు సూర్యకుమార్ యాదవ్ గాయపడడంతో ఆ ప్లేస్‌లోకి శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇచ్చాడు...
గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్‌లో కొన్ని మ్యాచులు మాత్రమే ఆడిన సూర్యకుమార్ యాదవ్, దెబ్బ కాస్త తిరగబెట్టడంతో సీజన్ సెకండాఫ్‌లో టీమ్‌కి దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కూడా దూరమైన సూర్యకుమార్ యాదవ్, ఐర్లాండ్ టూర్‌లో చోటు దక్కించుకున్నాడు...
Visakhapatnam: Indian players react after the end of the 3rd T20 cricket match between India and South Africa, at Dr. Y. S. Rajasekhara Reddy International Cricket Stadium, in Visakhapatnam, Tuesday, June 14, 2022. India won the match by 48 runs. (PTI Photo/R Senthil Kumar)(PTI06_14_2022_000421B)
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే జట్టులో కీలక ప్లేయర్లైన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ గాయాలతో ఇలా సగం మ్యాచులకు దూరం కావడం భారత జట్టు అభిమానులను కలవరబెడుతోంది...