- Home
- Sports
- Cricket
- ప్రాక్టీస్ మొదలెట్టిన రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా... ఐపీఎల్ ఆడడానికి రెఢీ అవుతున్నారంటూ ట్రోల్స్...
ప్రాక్టీస్ మొదలెట్టిన రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా... ఐపీఎల్ ఆడడానికి రెఢీ అవుతున్నారంటూ ట్రోల్స్...
ఐపీఎల్ వచ్చాక కొందరి క్రికెటర్ల కెరీర్ పూర్తిగా మారిపోయింది. అయితే ఐపీఎల్ కారణంగా మిగిలిన జట్లు ఎంత లాభపడ్డాయో, టీమిండియాకి అంత నష్టం చూకూరుతోంది. రెండు నెలల పాటు సాగే ఈ మెగా టోర్నీ కారణంగా క్రికెటర్లు అలిసిపోయి, గాయపడుతూ టీమిండియా ఆడే మ్యాచులకు దూరమవుతున్నారు...

Jasprit Bumrah
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో గాయపడిన రోహిత్ శర్మ, టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు. టీమిండియాకి మూడు ఫార్మాట్లలో పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నా... రోహిత్ ఆడిన మ్యాచుల కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ...
గాయంతో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సౌతాఫ్రికా టూర్‌కి దూరమైన రోహిత్ శర్మ, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. కెప్టెన్ రెస్ట్ కావాలని తప్పుకున్న వన్డే, టీ20 సిరీసుల సంఖ్య అయితే లెక్కే లేదు...
రోహిత్ శర్మతో పాటు ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలకు దూరమైన జస్ప్రిత్ బుమ్రా కూడా ప్రాక్టీస్ మొదలెట్టేశారు. ఈ ఇద్దరూ వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం...
Rohit Sharma
రోహిత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా, టీ20 సిరీస్ నుంచి అతనికి రెస్ట్ కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో లంకతో టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. 2024 వన్డే వరల్డ్ కప్‌కి టీమ్‌ని తయారుచేసేందుకు సీనియర్లను పక్కనబెట్టాలని నిర్ణయం తీసుకుందట బీసీసీఐ...
Image credit: Getty
గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీలో మధ్యలో తప్పుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, భార్య రివాబా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. మోకాలి గాయంతో టీమ్ నుంచి తప్పుకున్నా, ఎక్కడా ఇబ్బందిపడ్డట్టు కనిపించలేదు...
Image credit: Getty
ఈ ముగ్గురూ ప్రస్తుతం రీఎంట్రీ కోసం ప్రాక్టీస్ మొదలెట్టేశారు. అయితే రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా రీఎంట్రీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. కీలక టోర్నీలకు దూరంగా ఉన్న ఈ ముగ్గురూ సరిగ్గా ఐపీఎల్ సమయానికి ఫిట్‌గా ఎలా అయ్యారంటూ కామెంట్లు చేస్తున్నారు...