- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మ చాలా ఫ్రీడమ్ ఇస్తాడు! తొలి టెస్టుకి ముందు అజింకా రహానే కామెంట్స్.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సిరీయస్.
రోహిత్ శర్మ చాలా ఫ్రీడమ్ ఇస్తాడు! తొలి టెస్టుకి ముందు అజింకా రహానే కామెంట్స్.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సిరీయస్.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్ ఆడిన అజింకా రహానే, ఆ తర్వాత పేలవ ఫామ్‌తో 17 నెలల పాటు టీమ్‌కి దూరమయ్యాడు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన రహానే, వెస్టిండీస్ టూర్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు..

2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి టెస్టు పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ, పెటర్నిటీ లీవ్ కింద స్వదేశానికి వెళ్లిపోయాడు. మిగిలిన మూడు టెస్టులకు అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు..
గాయంతో రెండో టెస్టు ముగిసిన తర్వాత టీమ్‌తో కలిసిన రోహిత్ శర్మ, ఆఖరి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడేళ్ల తర్వాత రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించబోతుంటే, అజింకా రహానే అతనికి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు..
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మతో కలిసి మీడియా కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్నాడు అజింకా రహానే. ‘టెస్టు సిరీస్‌కి ముందు బ్రేక్ దొరకడంతో మానసికంగా, శారీరకంగా పూర్తిగా సిద్ధమయ్యాం. ప్రాక్టీస్ మ్యాచ్ కూడా బాగా ఆడాం. వెస్టిండీస్ టీమ్‌పై మాకు చాలా గౌరవం ఉంది..
వాళ్లు ఇప్పుడు ఫామ్‌లో లేకపోయినా తక్కువ అంచనా వేయడానికి లేదు. స్వదేశంలో వాళ్లు చాలా బాగా ఆడతారు, ముఖ్యంగా టెస్టుల్లో విండీస్‌ని ఓడించడం అంత తేలికైన విషయం కాదు. యశస్వి జైస్వాల్‌కి టెస్టు టీమ్‌లో చోటు దక్కడం చాలా ఆనందాన్ని ఇచ్చింది..
Ajinkya Rahane
అతను చాలా కష్టపడ్డాడు, ముంబై తరుపున దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్‌లో బాగా ఆడాడు. స్వేచ్ఛగా ఆడితే చాలు, అతను స్టార్ ప్లేయర్‌గా మారతాడు. నేను టెస్టుల్లో నాలుగైదు ఏళ్లుగా వైస్ కెప్టెన్‌గా ఉన్నా. తిరిగి జట్టులోకి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది..
Ajinkya Rahane
నాకు వయసు అయిపోలేదు. నేను ఇంకా యంగ్ క్రికెటర్‌నే. నాలో ఇంకా చాలా క్రికెట్ ఉంది. ఐపీఎల్‌లో బాగా ఆడా, దేశవాళీ టోర్నీల్లో బాగా ఆడా. నా ఆటను నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ప్రతీ మ్యాచ్‌పై పూర్తి ఫోకస్ పెడతా...
Cheteshwar Pujara and Ajinkya Rahane
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడడం చాలా గొప్ప అనుభూతి. రోహిత్, ప్లేయర్లందరికీ పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు, గేమ్‌పై ఫోకస్ పెట్టేలా చూస్తాడు. గొప్ప కెప్టెన్‌కి ఈ లక్షణం ఉండాలి. ప్లేయర్లకు స్వేచ్ఛని ఇచ్చి, వారిని ప్రొత్సహిస్తూ ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానే..
రహానే కామెంట్లపై కోహ్లీ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. దాదాపు మూడేళ్ల పాటు రహానే టెస్టు సగటు పడిపోతూ వస్తున్నా, అతనికి వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ వచ్చాడు విరాట్ కోహ్లీ... అజింకా రహానే కెరీర్‌లో ఎక్కువ మ్యాచులు ఆడింది, ఎక్కువ పరుగులు చేసింది విరాట్ కెప్టెన్సీలోనే..
రోహిత్ శర్మ కెప్టెన్సీలో అజింకా రహానే ఆడిందే ఒకే టెస్టు మ్యాచ్. దానికే అతన్ని తోపు, ప్లేయర్లకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తాడని కామెంట్ చేసిన అజింకా రహానే, విరాట్ కోహ్లీ అలా ఫ్రీడమ్ ఇవ్వడని పరోక్షంగా విమర్శలు చేస్తున్నట్టు ఉందని కామెంట్లు చేస్తున్నారు అతని అభిమానులు..