- Home
- Sports
- Cricket
- విరాట్‌కి మరింత చేరువైన రోహిత్ శర్మ... టాప్ 10లోకి రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా...
విరాట్‌కి మరింత చేరువైన రోహిత్ శర్మ... టాప్ 10లోకి రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా...
తొలి టెస్టులో తొలి బంతికే డకౌట్ అయిన విరాట్ కోహ్లీ... టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 5 నుంచి జారిపోయే ప్రమాదంలో పడ్డాడు. మూడు ఫార్మాట్లలో టాప్ 5 ర్యాంకింగ్స్‌లో ఉన్న ఒకే ఒక్క బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ... ఆ రికార్డుకు దూరమయ్యే ప్రమాదంలో పడ్డాడు...

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. రెండో ఇన్నింగ్స్‌లో అయితే వర్షం కారణంగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు..
తొలి టెస్టులో ఫెయిల్యూర్ కారణంగా 21 పాయింట్లు కోల్పోయాడు. ఇదే సమయంలో టాప్ 6లో ఉన్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ 5 పాయింట్లు సాధించాడు...
తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న రోహిత్... 5 పాయింట్లు ఖాతాలో వేసుకుని 764 పాయింట్లలో టాప్ 6లో ఉన్నాడు.
టాప్ 7లో ఉన్న వారిలో బెస్ట్ ర్యాంకు సాధించిన ఏకైక ఓపెనర్ రోహిత్ శర్మయే కావడం విశేషం. విరాట్ కోహ్లీ ఖాతాలో 791 పాయింట్లు ఉంటే, రోహిత్ శర్మ అతని కంటే 27 పాయింట్లు వెనకబడి ఉన్నాడు..
రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో ఉన్న భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా ఆరు పాయింట్లు కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు పంత్...
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ 901 పాయింట్లతో టాప్‌లో ఉంటే, స్టీవ్ స్మిత్ 891, లబుషేన్ 878 పాయింట్లతో టాప్ 3లో ఉన్నారు...
టాప్ 5లో ఉన్న జో రూట్.. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చేలరేగి.. టాప్ 4లోకి దూసుకొచ్చాడు... ఆ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఉన్నారు.
ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 724 పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా, క్వింటన్ డి కాక్ 717 పాయింట్లత 9వ స్థానంలో ఉన్నాడు. హెన్రీ నికోలస్, బాబర్ ఆజమ్ 714 పాయింట్లతో టాప్ 10లో ఉన్నారు....
తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా... మళ్లీ ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు... ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకున్న బుమ్రా... 760 పాయింట్లతో టాప్ 9 పొజిషన్‌లో ఉన్నాడు...
ఆసీస్ స్టార్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ 908 పాయింట్లతో టాప్‌లో ఉండగా... తొలి టెస్టు ఆడని రవిచంద్రన్ అశ్విన్ 856 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.