- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మ చిన్నతనంలో పాల ప్యాకెట్లు వేసేవాడు... షాకింగ్ విషయాలు బయటపెట్టిన ప్రజ్ఞాన్ ఓజా..
రోహిత్ శర్మ చిన్నతనంలో పాల ప్యాకెట్లు వేసేవాడు... షాకింగ్ విషయాలు బయటపెట్టిన ప్రజ్ఞాన్ ఓజా..
35 ఏళ్ల లేటు వయసులో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ. ఐపీఎల్‌లో 8 సీజన్లలో 5 టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ కెరీర్, 2013 తర్వాతే గాడిలో పడింది. రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా..

Rohit Sharma - Pragyan Ojha
రోహిత్ శర్మతో కలిసి 2008లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి ఆడిన ప్రజ్ఞాన్ ఓజా, 2009లో టైటిల్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి ముంబై ఇండియన్స్ తరుపున కూడా ఆడారు. 2015 తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయి, ఐపీఎల్‌కి కూడా దూరమైన ఓజా, రోహిత్ శర్మకు బెస్ట్ ఫ్రెండ్...
Pragyan Ojha
‘రోహిత్ శర్మను నేను మొదటిసారి అండర్15 నేషనల్ క్యాంప్‌లో చూశా. అప్పుడే అతనికి మంచి ఫాలోయింగ్ ఉండేది. రోహిత్ స్పెషల్ ప్లేయర్ అని చెప్పుకునేవాళ్లు. అండర్15 స్టేజీలో నేను, రోహిత్ శర్మకు ప్రత్యర్థిగా ఆడాను. అతని వికెట్ కూడా తీశాను...
రోహిత్ ఓ టిపికల్ ముంబై కుర్రాడు. అతను పెద్దగా మాట్లాడడు, అయితే ఇట్టే కోపం వచ్చేస్తుంది. అతన్ని అవుట్ చేయగానే నాపై కోపంగా అరిచాడు. నేను దానికి షాక్ అయ్యాను. నేను అతనికి పెద్దగా తెలీదు అయినా ఎందుకిలా చేశాడో అర్థం కాలేదు. అయితే ఆ సంఘటన తర్వాత మా మధ్య స్నేహం మొదలైంది...
రోహిత్ శర్మ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడు. ఓసారి క్రికెట్ కిట్స్ కొనడానికి కూడా డబ్బులు లేవని మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్రికెట్ కిట్స్ కొనడానికి డబ్బుల కోసం పాల ప్యాకెట్లు కూడా వేశాడు.. ఇప్పుడు అతన్ని చూస్తే గర్వంగా ఉంటుంది...
అతని జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లింది. ఇప్పుడు రోహిత్ శర్మతో కలిసి ఆడానని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. రంజీ ట్రోఫీలో ముంబై తరుపున ఆడేందుకు రోహిత్‌కి అవకాశం వచ్చే వరకూ మా ఇద్దరికి కేవలం పరిచయం మాత్రమే ఉంది...
అయితే మా ఇద్దరినీ ఓ పాయింట్ బాగా కనెక్ట్ చేసింది. రోహిత్‌కి ఎవ్వరికీ తెలియని ఓ సీక్రెట్ టాలెంట్ ఉంది. అతను చాలా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. తన తోటి ప్లేయర్లను అచ్చు గుద్దినట్టు ఇమిటేట్ చేసేవాడు. నాకు అలాంటివంటే బాగా ఇష్టం.. అందుకే ఈజీగా కనెక్ట్ అయిపోయా...
నేను ఎప్పుడైనా ఒత్తిడికి లోనైతే, వెంటనే రోహిత్ శర్మను కలిసేవాడిని. అతని తన మిమిక్రీతో నన్ను నవ్వించేవాడు. అది నా టెన్షన్‌ని పూర్తిగా తగ్గించేది... ఇప్పటికీ తనలో ఆ టాలెంట్ అలాగే ఉందనుకుంటా..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా...