- Home
- Sports
- Cricket
- ఆ ప్లేస్‌లో ఆడతానని శుబ్‌మన్ గిల్, స్వయంగా ద్రావిడ్‌ని అడిగాడు... - టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
ఆ ప్లేస్‌లో ఆడతానని శుబ్‌మన్ గిల్, స్వయంగా ద్రావిడ్‌ని అడిగాడు... - టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
వెస్టిండీస్ టూర్ 2023 నుంచి టెస్టుల్లో కొత్త తరాన్ని పరిచయం చేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది టీమిండియా. 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమయానికి టీమ్‌ని సిద్ధం చేసేందుకు వెస్టిండీస్ టూర్ నుంచే పథకాలు రచిస్తోంది బీసీసీఐ... తొలి టెస్టులో యశస్వి జైస్వాల్, అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నట్టు రోహిత్ శర్మ ప్రకటించాడు..

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఫెయిలైన ఛతేశ్వర్ పూజారాకి, వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌లో చోటు దక్కలేదు. అతని ప్లేస్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు టీమ్‌లో చోటు కల్పించారు సెలక్టర్లు... ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన యశస్వి జైస్వాల్, తొలి టెస్టులో ఆరంగ్రేటం చేయబోతున్నాడు..
‘తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్నో ఏళ్లుగా సరైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కోసం వెతుకుతున్నాం. యశస్వి జైస్వాల్ రూపంలో ఓ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దొరికాడు. అతను బాగా ఆడి టీమ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని అనుకుంటున్నా...
శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో ఆడతాడు. అతనే స్వయంగా రాహుల్ ద్ారవిడ్‌తో కలిసి మూడో స్థానంలో ఆడాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. రాహుల్ ద్రావిడ్ కెరీర్ మొత్తం మూడు, నాలుగు స్థానాల్లోనే ఆడాడు... కాబట్టి ఆయన మార్గంలోనే నడవాలని గిల్ అనుకుంటున్నాడు..
ఓపెనర్‌గా కంటే మూడో స్థానంలో బాగా ఆడగలనని అతను నమ్ముతున్నాడు. అంతేకాకుండా మాకు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది. ఇది వర్కవుట్ అయితే సుదీర్ఘ కాలం కొనసాగిస్తాం...
వికెట్‌ని బట్టి ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో ఆడతాం. 2017లో ఇక్కడ టెస్టు మ్యాచ్ ఆడినప్పుడు స్పిన్నర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. ప్రాక్టీస్ సమయంలో బౌన్సీ పిచ్‌లా అనిపించింది. అందుకే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్ కరెక్ట్ అని అనుకుంటున్నాం..
దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న ప్రతీ ప్లేయర్‌ని సెలక్టర్లు తీక్షణంగా గమనిస్తున్నారు. అందరికీ సరైన సమయంలో రివార్డు దక్కుతుంది. ఈ సిరీస్‌లో కొందరు ప్లేయర్లకు అవకాశం దక్కలేదు. ఎందుకంటే ఏ సిరీస్‌కైనా 15 మంది ప్లేయర్లనే సెలక్ట్ చేయగలం...
శుబ్‌మన్ గిల్, కొన్నేళ్ల పాటు నిలకడైన ప్రదర్శన ఇచ్చాకే టీమ్‌లోకి వచ్చాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో రుతురాజ్ గైక్వాడ్ కూడా బాగా సెట్ అవుతాడనే ఉద్దేశంతోనే అతన్ని సెలక్ట్ చేశాం. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ చాలా అవసరం. అందుకే వీలైనంత మందికి రిటేషన్ పద్దతిలో అవకాశం కల్పిస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..