- Home
- Sports
- Cricket
- పంత్ లేకపోవడం టీమిండియాకు పూడ్చలేని లోటు.. అతడిని ఆడిస్తేనే బెటర్ అంటున్న ఆసీస్ దిగ్గజం
పంత్ లేకపోవడం టీమిండియాకు పూడ్చలేని లోటు.. అతడిని ఆడిస్తేనే బెటర్ అంటున్న ఆసీస్ దిగ్గజం
WTC Finals 2023: త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో భారత జట్టుకు వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూరమవడం పూడ్చలేని లోటు అని ఆసీస్ దిగ్గజం మాథ్యూ హెడెన్ అన్నాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తూ హరిద్వార్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే ఈ నెల 7 నుంచి 11 మధ్య ఇంగ్లాండ్ లోని ప్రముఖ స్టేడియం ‘ది ఓవల్’ లో పంత్ లేని లోటు టీమిండియాకు పూడ్చలేనిదని ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ అన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో హెడెన్ మాట్లాడుతూ.. ‘టీమిండియాకు పంత్ లేని లోటు పూడ్చలేనిది. ఒకవేళ నేనే ఇండియా సెలక్టర్ అయితే అతడిలాగే దూకుడుగా ఆడే వికెట్ కీపర్ బ్యాటర్ నే ఎంచుకునేవాడిని. ఆ లక్షణాలు ఇషాన్ కిషన్ లో పుష్కలంగా ఉన్నాయి.
కిషన్ కూడా పంత్ మాదిరిగానే దూకుడుగా ఆడగలడు. బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా అతడు పంత్ ను గుర్తుకుతెస్తాడు..’అని చెప్పాడు. పంత్ గైర్హాజరీ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో కెఎస్ భరత్, ఇషాన్ లలో ఎవరిని ఆడించాలనేదానిపై టీమ్ మేనేజ్మెంట్ తర్జనభర్జనలు పడుతోంది.
Image credit: Getty
కాగా రాబోయే ఫైనల్ లో భారత జట్టుకు స్పిన్నర్లే కీలకమవుతారని హెడెన్ అన్నాడు. ‘టీమిండియాకు అశ్విన్, జడేజా, అక్షర్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఆసీస్ కు ఈ విషయంలో టీమిండియాకు ఉన్న అడ్వాంటేజ్ లేదు. ఒకవేళ ఓవల్ పిచ్ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మాదిరిగానే టర్న్ అయితే అప్పుడు అది భారత జట్టుకు అనుకూలించేదే..’అని చెప్పాడు.
అయితే స్పిన్నర్లు లేకపోయినా కామెరూన్ గ్రీన్ రూపంలో ఆసీస్ కు నిఖార్సైన పేస్ ఆల్ రౌండర్ ఉన్నాడని.. అతడి రాకతో అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా ఆసీస్ కు అదనపు బలం పెరిగిందని హెడెన్ అన్నాడు. ఇంగ్లాండ్ లో సాధారణంగా బౌన్సీ పిచ్ లపై గ్రీన్ తో పాటు ఆసీస్ పేస్ బౌలింగ్ లైనప్ భారత్ కు కష్టాలను సృష్టిస్తుందని అంచనా వేశాడు.
ఐపీఎల్ లో ఆడిన ఇండియా - ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో తలపడుతుండటం వారికి కలిసొచ్చేదేనని.. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే వారికి రెండు నెలల పాటు ఐపీఎల్ ద్వారా మంచి మ్యాచ్ ప్రాక్టీస్.. ఒత్తిడిని ఎదుర్కునే తత్వం అలవడ్డాయని చెప్పుకొచ్చాడు.