- Home
- Sports
- Cricket
- రిషబ్ పంత్ లేకపోయినా అతని జెర్సీని ఆడిస్తాం... ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నిర్ణయం..
రిషబ్ పంత్ లేకపోయినా అతని జెర్సీని ఆడిస్తాం... ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నిర్ణయం..
రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మూడు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. మోకాలికి సర్జరీ జరగడంతో ఇప్పుడిప్పుడే మళ్లీ అడుగులు వేస్తున్న రిషబ్ పంత్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు...

Rishabh Pant
శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ ఫేజ్ నుంచి తప్పుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రిషబ్ పంత్... పంత్ కెప్టెన్సీకి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్ తెగ ఇంప్రెస్ అయిపోయింది..
అందుకే ఆరు నెలల తర్వాత శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని సెకండ్ ఫేజ్‌లో రీఎంట్రీ ఇచ్చినా రిషబ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. పంత్ పుణ్యాన 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాతి సీజన్‌లోనే కెప్టెన్సీ కోల్పోయి.. ఆఖరికి ఫ్రాంఛైజీ మారాల్సి వచ్చింది...
రిషబ్ పంత్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడకపోయినా, అతను తమతోనే ఉన్నట్టు ఫీల్ కలిగిలా చేస్తామంటోంది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్.. ‘రిషబ్ పంత్ మా పక్కనే ఉండి, ప్రతీ మ్యాచ్‌కి డగౌట్‌లో కూర్చుంటే.. ఇది మునుపటి టీమ్‌లా ఉంటుంది. అయితే రిషబ్ పంత్ ఇప్పుడున్న పొజిషన్‌లో అది వీలు కాదు.
అయితే రిషబ్ పంత్ టీమ్‌తోనే ఉన్న ఫీలింగ్ కలిగిలా అతని జెర్సీని ఆడిస్తాం. టీమ్‌లో 11 మందిలో ఎవరో ఒకరు రిషబ్ పంత్ జెర్సీ వేసుకుని ఆడతారు. అలాగే ప్లేయర్లు పెట్టుకునే క్యాప్‌లో రిషబ్ పంత్ జెర్సీ నెంబర్ ఉంటుంది...
రిషబ్ పంత్ మాతో లేకపోయినా అతనే మా లీడర్ అని చాటి చెప్పడానికే ఇలా చేయబోతున్నాం. రిషబ్ పంత్ ప్లేస్‌లో ఎవరితో వికెట్ కీపింగ్ చేయించాలనే విషయాన్ని ఇంకా డిసైడ్ చేయలేదు. సర్ఫరాజ్ ఖాన్ వికెట్ కీపింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు..
రిషబ్ పంత్ లేకపోవడంతో వికెట్ కీపర్ బ్యాటర్ ప్లేస్, టీమ్‌కి చాలా పెద్ద లోటుగా మారింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రావడంతో దాన్ని వాడి ప్లేయర్లను ఉపయోగించాలని అనుకుంటున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్...
Image credit: Getty
ఐపీఎల్ 2023 సీజన్‌కి డేవిడ్ వార్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఐపీఎల్ టైటిల్ అందించిన వార్నర్‌పై భారీ ఆశలే పెట్టుకుంది ఢిల్లీ.. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.