కరోనా బాధితుల కోసం కదిలిన రిషబ్ పంత్... చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ వంతుగా..

First Published May 9, 2021, 10:47 AM IST

దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ బాధితుల కోసం భారత యంగ్ వికెట్ కీపర్ తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. సోషల్ మీడియా ద్వారా కరోనా రోగుల సాయంగా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు అందిస్తున్నట్టు తెలిపాడు రిషబ్ పంత్.