Richest Indian Cricketer: కోహ్లీ కాదు, ధోనీ కాదు, సచిన్ కాదు.. మరి ఎవరు?
Richest Indian Cricketer: భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ ను అధిగమించి ఒక మాజీ క్రీడాకారుడు టాప్ లో నిలిచాడు.

గెట్టి ఇమేజెస్
Richest Indian Cricketer: భారతదేశంలోని అత్యంత సంపన్న క్రికెటర్ల గురించిన ప్రశ్నలు వచ్చినప్పుడు ముందుగా రన్ మిషన్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల పేర్లు గుర్తుకు వస్తాయి. అయితే, భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ బిరుదు ఈ ఆధునిక కాలపు దిగ్గజాలలో ఎవరికీ దక్కదు. దేశంలో మీరిని మించిన రిచెస్ట్ క్రికెటర్ కూడా ఉన్నాడు. అతనే టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా. అతని నికర విలువ రూ. 1,450 కోట్లకు పెరిగింది.
భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలు భారీగానే సంపదను కలిగి ఉన్నారు. కింగ్ కోహ్లీ నికర విలువ రూ. 1,050 కోట్లు, ధోనీ రూ. 1,000 కోట్లు, రోహిత్ శర్మ రూ. 214 కోట్లు సంపద కలిగి ఉన్నారు. అయితే, వీరందరిని మించిపోయాడు అజయ్ జడేజా. అతనికి ఇటీవల వారసత్వంగా పొందిన ఆర్థిక సామ్రాజ్యంతో ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా మారారు.
1990లలో తన అద్భుతమైన ప్రదర్శనలకు పేరుగాంచిన మాజీ భారత క్రికెటర్ అజయ్ జడేజా, ఇప్పుడు తన రాజ వంశం నుండి గణనీయమైన వారసత్వం కారణంగా అగ్రస్థానంలో ఉన్నారు. అతను ఇటీవల జామ్‌నగర్ రాజ సింహాసనానికి వారసుడిగా నియమితులయ్యారు. దీంతో అజయ్ జడేజా నికర విలువ రూ. 250 కోట్ల నుండి రూ. 1,450 కోట్లకు పెరిగింది.
ఒకప్పుడు గుజరాత్‌లో ఒక సంస్థాన రాష్ట్రంగా ఉన్న జామ్‌నగర్, అపారమైన చారిత్రక, ఆర్థిక వారసత్వాన్ని కలిగి ఉంది, ఇది ఇప్పుడు జడేజా సంపదలో భాగమైంది. అతను రాజవంశానికి చెందినవాడు. క్రికెట్ రాజ వంశానితో కూడా ప్రత్యేక సంబంధం కలిగి ఉంది.
అతని రాజ వారసత్వం అతన్ని ఇప్పుడు సంపద జాబితాలో అగ్రస్థానానికి నడిపించినప్పటికీ, జడేజా క్రికెట్ కెరీర్ వివాదాలతో నిండిపోయింది. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో అతని ప్రమేయం కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతనిని నిషేధించింది. ఆ తర్వాత అతను కామెంటర్ గా మారడు. శిక్షణ, బాలీవుడ్ వెంచర్‌లు, డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జాలో కూడా పాల్గొన్నాడు.