- Home
- Sports
- Cricket
- ఐపీఎల్‌లో నా ఫేవరేట్ టీమ్ ఆర్సీబీ.. అతడితో బ్యాటింగ్ చేయడమంటే ఇష్టమంటున్న వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్
ఐపీఎల్‌లో నా ఫేవరేట్ టీమ్ ఆర్సీబీ.. అతడితో బ్యాటింగ్ చేయడమంటే ఇష్టమంటున్న వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్
IPL 2023: ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ తో పాటు క్రికెటర్లలోనూ సూపర్ ఫాలోయింగ్ ఉంది.

టెస్టులలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న మార్నస్ లబూషేన్ ఐపీఎల్ లో తన ఫేవరేట్ టీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ ఫేవరేట్ అని తెలిపాడు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఫిబ్రవరిలో భారత్ కు వచ్చిన లబూషేన్.. వన్డే సిరీస్ ముగిసినా ఇక్కడే ఉన్నాడు. ఈ సందర్భంగా ట్విటర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ నిర్వహించాడు. లబూషేన్.. ఐపీఎల్ లో తన ఫేవరేట్ టీమ్, స్పిన్నర్, ఫేవరేట్ బ్యాటర్, బెస్ట్ ఫూడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ లో తనకు ఫేవరేట్ టీమ్ ఏదని లబూషేన్ ను అడగగా.. అతడు ‘ఆర్సీబీ’ అని సమాధానం చెప్పాడు. ఈ లీగ్ లో ఒకవేళ మీకు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి అవకాశమొస్తే ఎవరితో బ్యాటింగ్ చేస్తారు..? అనే ప్రశ్నకు కూడా ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరునే చెప్పాడు.
టీమిండియా సారథి రోహిత్ శర్మ గురించి వన్ వర్డ్ లో చెప్పమనగా.. ‘ఒక వర్డ్ కంటే ఎక్కువ.. అతడి బ్యాటింగ్ చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది..’అని చెప్పాడు. తాను ఎదుర్కున్న బౌలర్లలో బెస్ట్ స్పిన్నర్ ఎవరు..? అని అడగగా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు వెల్లడించాడు.
టీ20లలో నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్, రిజ్వాన్ లలో ఎవర్నో ఒకరిని ఎంచుకోవాలనగా.. తనకు స్కై(సూర్య) అంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు. క్రికెట్ చరిత్రలో వీళ్ల బౌలింగ్ లో ఆడుంటే బాగుండేదని అనిపించిన బౌలర్ పేరు చెప్పాలనగా.. డేల్ స్టెయిన్, షాన్ పొలాక్, గ్లెన్ మెక్‌గ్రాత్ ల పేర్లు సూచించాడు.
భారత్ లో నచ్చిన ఫుడ్ ఏంటని అడగ్గా... బటర్ చికెన్, స్పినాచ్ (బచ్చలి కూర), చీజ్ తో తయారుచేసే నాన్ అంటే ఇష్టమని, గడిచిన 8 వారాలుగా రోజూ ఇదే తింటున్నానని లబూషేన్ చెప్పుకొచ్చాడు. కాగా లబూషేన్ ఐపీఎల్ 2022 వేలంలో పేరు నమోదుచేసుకున్నా ఈ టెస్ట్ బ్యాటర్ ను కొనుగోల చేయడానికి ఏ జట్టూ ముందుకురాలేదు.