నాలుగో టెస్టుకి ముందు టీమిండియాకి షాక్... ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రవీంద్ర జడేజా...
మూడో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియాకి నాలుగో టెస్టుకి ముందు ఊహించని షాక్ తగిలింది. బాల్‌తో పెద్దగా రాణించకపోయినా, వరుసగా టెస్టు మ్యాచులు ఆడుతున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో బాధపడుతున్నాడు...

లీడ్స్ టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌట్ కావడం, భారత జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో పోరాడినా 278 పరుగులకే ఆలౌట్ అయ్యింది...
తొలి ఇన్నింగ్స్‌లో 29 బంతుల్లో 4 పరుగులు చేసి నిరాశపరిచిన రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి ఓవర్టన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
మొదటి రెండు టెస్టుల్లో వికెట్ తీయలేకపోయిన రవీంద్ర జడేజా, మూడో టెస్టులో మాత్రం రెండు వికెట్లు పడగొట్టాడు. క్రీజులో కుదురుకున్న ఓపెనర్ హసీబ్ హమీద్‌తో పాటు ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీని అవుట్ చేసిన జడ్డూ, ఐదు ఇన్నింగ్స్‌ల తర్వాత తొలిసారి బాల్‌తోనూ రాణించాడు...
అయితే లీడ్స్ టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రవీంద్ర జడేజా, నాలగో టెస్టులో ఆడడం అనుమానంగా మారింది. స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లిన జడేజా... ‘ఇలాంటి ప్లేస్‌లో ఉండడం మంచిది కాదేమో’ అంటూ కాప్షన్ ఇచ్చాడు...
రవీంద్ర జడేజా గాయపడడంతో అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అశ్విన్‌ను ఆడిస్తారా? లేక మరో బ్యాట్స్‌మెన్‌గా మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరికి చోటు ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది...
సెప్టెంబర్ 2న ఓవల్ వేదికగా నాలుగో టెస్టు ఆడనుంది భారత జట్టు. మూడో టెస్టులో గెలిచి, సిరీస్ సమం చేసింది ఇంగ్లాండ్. దీంతో నాలుగో టెస్టు ఇరు జట్లకి కీలకం కానుంది...
రవీంద్ర జడేజాతో పాటు మూడో టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇషాంత్ శర్మ కూడా నాలుగో టెస్టులో ఆడడం అనుమానంగా మారింది. అతని స్థానంలో స్వింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడతాడని ప్రచారం జరుగుతోంది.