అశ్విన్ ఇంత ఆనందంగా ఎప్పుడూ లేడు... అశ్విన్ సతీమణి ప్రీతి ఉద్వేగభరిత పోస్ట్...
First Published Dec 30, 2020, 6:48 PM IST
రవిచంద్రన్ అశ్విన్... రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన అశ్విన్, రెండో టెస్టులో మొత్తంగా 5 వికెట్లు తీశాడు. బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాకి దక్కిన తొలి వికెట్ అశ్విన్ బౌలింగ్‌లోనే. పదో ఓవర్‌లోనే అశ్విన్‌కి బాల్ అందించిన అజింకా రహానే, అదిరిపోయే రిజల్ట్ రాబట్టాడు. బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా... ఆ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

బుమ్రా, జడేజా, ఉమేశ్ యాదవ్, అజింకా రహానే, బుమ్రాలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన రవిచంద్రన్ అశ్విన్... ‘గోడకు అటు తిరిగి ఉన్నప్పుడు, నీ వీపును దానికి ఒరిగించు... ఆ సపోర్టును ఎంజాయ్ చెయ్... జట్టంతా కలిసి అద్భుతంగా ఆడింది. ఇది నూటి నూరు శాతం దక్కిన సంపూర్ణ విజయం...’ అంటూ ట్వీట్ చేశాడు.

మొదటి మ్యాచ్ ఆడుతున్న మహ్మద్ సిరాజ్, శుబ్‌మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేనంటూ... వాళ్లని కూడా ట్యాగ్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?